హైదరాబాద్‌లో 7,800 మంది మల్టీ మిలియనీర్లు: వేగంగా పెరుగుదల
హైదరాబాద్: ఎక్కువమంది మల్టీమిలియనీర్లు వేగంగా ఎదుగుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఉంది. ఏసియా ఫసిపిక్ 2016 'న్యూ వరల్డ్ వెల్త్' నివేదిక ప్రకారం.. ఢిల్లీ, ముంబైల తర్వాత సంపన్నుల జాబితాలో భాగ్యనగరం ఉంది.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక సంపన్నులున్న నగరాల జాబితాలో ముంబై, రాజధాని ఢిల్లీ నగరాలు చోటు సంపాదించాయి. సంపన్నుల సంఖ్య పెరుగుతోన్న నగరాల్లో హైదరాబాద్‌కు చోటు కూడా చోటు దక్కించుకోవడం గమనార్హం.
2,64,000 మంది సంపన్నుల (అధిక విలువ కలిగిన వ్యక్తులు - హెచ్‌ఎన్‌ఐ)ను కలిగిన టోక్యో ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. ముంబై 12వ స్థానాన్ని (41,200), ఢిల్లీ 20వ స్థానాన్ని (20,600 మంది) దక్కించుకున్నాయి.

మిలియన్ డాలర్లు (సుమారు రూ.6.5 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ నికర ఆస్తి ఉన్నవారిని హెచ్‌ఎన్‌ఐలుగా పరిగణిస్తారు. సంపన్నుల వృద్ధి విషయానికొస్తే.. ఢిల్లీ, ముంబైలకు తొలి ఐదు నగరాల్లో చోటు లభించింది.
2000- 2015 మధ్య ఈ రెండు నగరాల్లో సంపన్నుల వృద్ధి వరుసగా 357 శాతం, 335 శాతంగా ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంపన్నులు వేగంగా పెరుగుతోన్న జాబితాలో భారత్ నుంచి ఆరు నగరాలకుస్థానం లభించింది.
వీటిలో కోల్‌కత్తా (8,700 మంది), హైదరాబాద్ (7,800), బెంగళూరు (6,700), చెన్నై (6,000), పుణె (3,800), అహ్మదాబాద్ (3,700) ఉన్నాయి. మల్టీ మిలీయనీర్ల విషయంలోనూ హైదరాబాద్ (510 మంది) వర్ధమాన నగరాల్లో ఒకటిగా నిలిచింది.












Click it and Unblock the Notifications