హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిశోధనా కేంద్రంగా హైదరాబాద్: కెటిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచంలోనే హైదరాబాద్ పరిశోధనాకేంద్రంగా విరాజిల్లుతోందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కపిల్ టవర్స్‌లో సాఫ్ట్ మిషిన్స్ (ఎస్‌ఎమ్ సిలికాన్ ఇండియా ప్రై లిమిటెడ్) సాఫ్ట్‌వేర్ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ శక్తిమంతమైన నగరంగా దూసుకెళుతుందన్నారు.

తెలంగాణ హబ్ ఏర్పాటు కోసం సర్కార్ ఇప్పటికే పలు కార్యక్రమాలు రూపొందించిందన్నారు. ఇందులోభాగంగా ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రాయదుర్గంలో మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంక్యూబేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికల రూపకల్పన పూర్తయిందని కెటిర్ వివరించారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆలోచనలు ఒకే వేదిక మీదకు తేవడంతో పలు అద్భుతాలు సృష్టించవచ్చునని తెలిపారు. ఐటీ కారిడార్‌లో భద్రత విషయంలో ముఖ్యమంత్రి మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు నర్సిరెడ్డి, మహేష్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కెటిఆర్

కెటిఆర్

ప్రపంచంలోనే హైదరాబాద్ పరిశోధనాకేంద్రంగా విరాజిల్లుతోందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు.

కెటిఆర్

కెటిఆర్

శుక్రవారం ఆయన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కపిల్ టవర్స్‌లో సాఫ్ట్ మిషిన్స్ (ఎస్‌ఎమ్ సిలికాన్ ఇండియా ప్రై లిమిటెడ్) సాఫ్ట్‌వేర్ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ శక్తిమంతమైన నగరంగా దూసుకెళుతుందన్నారు.

కెటిఆర్

కెటిఆర్


ఈ ఏడాది నగరం నుంచి రూ. 50 వేల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగాయని చెప్పారు. వచ్చే మూడేండ్లలో అది రూ. లక్ష కోట్లకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.

కెటిఆర్

కెటిఆర్

నిరుద్యోగ ఇంజినీర్లలో నైపుణ్యం పెంపునకు రాష్ట్రప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. విద్యార్థుల్లోనూ నైపుణ్యం పెంపుదలకు జేఎన్‌టీయూ(హెచ్) ద్వారా శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.

English summary
Telangana IT Minister KT Rama Rao on Friday said that Hyderabad is research center of the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X