వర్షం ఎఫెక్ట్: 6 ఫీట్ల ఎత్తులో ఎగజిమ్మిన విషపు నురగ, భయంతో ఇళ్ళలోనే..
Recommended Video

హైదరాబాద్: హైద్రాబాద్‌లో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం సరూర్‌నగర్ చెరువు కట్ట కింది భాగంలోని కోదండరామనగర్ వాసులను తీవ్ర ఇబ్బందులపాల్జేసింది. ఎగువ ప్రాంతాల నుండి వచ్చి చేరిన పారిశ్రామిక వ్యర్థాల కారణంగా సరూర్‌నగర్ చెరువు కట్ట కింది బాగంలో మ్యాన్‌హోల్స్ నుండి పెద్ద ఎత్తున విషపు నురగ వచ్చి చేరింది. స్థానికుల ఇళ్ళలోకి పెద్ద ఎత్తున వరద నీరు, విషపు నురగ చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.
సరూర్‌నగర్ చెరువు కట్ట కింద ప్రాంతంలో కోదంరామనగర్ వాసులు వర్షంతో పాటు విషపునురగతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరూర్‌నగర్ చెరువులోకి ఎగువ ప్రాంతాల నుండి భారీ ఎత్తున పారిశ్రామిక వ్యర్థాలు వచ్చి చేరాయి. ఈ వ్యర్థాల కారణంగా నీరంతా కలుషితమైంది.
వరద నీరు ఉధృతి పెరగడంతో కోదండరామనగర్‌కు సమీపంలోని మ్యాన్‌హోల్స్ నుండి పెద్ద ఎత్తున విషపు నురగ ఇళ్ళలోకి వచ్చి చేరింది. మంగళవారం తెల్లవారుజామున ఉదయం 1 గంటల నుండి ఈ నురగ వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.

కలుషితమైన సరూర్‌నగర్ చెరువు నీరు
సరూర్‌నగర్ చెరువు కట్టకు దిగువ భాగంలో శారద థియేటర్ ఉంటుంది. దీనికి సమీపంలో ఉన్న మ్యాన్‌హోల్ నుండి మంగళవారం తెల్లవారుజాము నుండి విషపునురగ ఎగజిమ్ముతోందని జిహెచ్ఎంసి అధికారులు ప్రకటించారు.రోడ్లపైకి, సమీపంలోకి ఇళ్ళలోకి విషపు నురగ వచ్చి చేరింది. దీంతో స్థానికులు ఇబ్బందులుపడ్డారు.వ్యర్థాల కారణంగానే సరూర్‌నగర్ చెరువు నీరు కలుషితమైందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మ్యాన్‌హోల్స్‌లో పేరుకుపోయిన విషపు నురగ
సరూర్‌నగర్ చెరువు నుండి ఓవర్‌ప్లో అయ్యే నీటిని మూసి నదికి తరలించేందుకుగాను మ్యాన్‌హోల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ మ్యాన్‌హోల్స్ మురికి నీటి డ్రైనేజీ వ్యవస్థకు అనుసందించారు.అయితే వ్యర్థాల కారణంగా ఈ మ్యాన్‌హోల్స్‌లో ఉదయం నుండి విషపునురగ చేరుకొంది. అయితే చెరువు నుండి అదనపు నీరు రావడం, ఇళ్ళ నుండి కూడ ఎక్కువ మొత్తంలో నీరు రావడంతో విషపు నురగగా మారిందని మ్యాన్‌హోల్స్ నుండి బయటకు ఎగజిమ్మిందని అధికారులు చెబుతున్నారు.

ఆరు ఫీట్ల ఎత్తుకు చేరిన విషపు నురగ
మ్యాన్‌హోల్స్ నుండి ఎగిసిన విషపు నురగ సుమారు ఆరుఫీట్ల ఎత్తుకు చేరుకొందని స్థానికులు చెప్పారు. అంతేకాదు ఇళ్ళ బయట నిలిపి ఉంచిన వాహనాలపై ఈ విషపు నురగ పేరుకుపోయిందని స్థానికులు చెప్పారు. అంతేకాదు ఇళ్ళ నుండి బయటకు రావడానికి బయపడ్డామని స్థానికుడు యాదగిరిరెడ్డి చెప్పారు.

కలుషితమైన చెరువుల జాబితాలో సరూర్‌నగర్ చెరువు
మ్యాన్‌హోల్స్ నుండి ఎగిసిపడుతున్న విషపు నురగను ఆపేందుకు నాలుగు ట్యాంకర్ల నీటిని చల్లినట్టు జిహెచ్‌ఎంసి అధికారి సంజుకుమార్ చెప్పారు. మ్యాన్‌హోల్ నుండి ఫౌంటేన్ నుండి నీరు ఎగజిమ్మినట్టుగానే విషపు నురగ ఎగజిమ్మిందని చెప్పారు సంజుకుమార్.అయితే ఈ ఫ్రెషర్‌ను ఆపేందుకుగాను ఇసుకబస్తాలను మ్యాన్‌హోల్స్‌పై ఉంచినట్టు చెప్పారు. నగరంలో కలుషితమైన చెరువుల్లో సరూర్‌నగర్ చెరువు 7వ, చెరువుగా అధికారులు గుర్తించారు.

మంచు పర్వతంగా కన్పించిన సరూర్‌నగర్ చెరువు
విషపు నురగ కారణంగా సరూర్ నగర్ చెరువు మంగళవారం ఉదయం వరకు మంచు పర్వతం మాదిరిగా కన్పించింది. అయితే ఈ విషపు నురగను మున్సిఫల్ కార్మికులు తొలగించారు.ఎగువ ప్రాంతాల నుండి మురుగు నీరు సరూర్‌నగర్ చెరువులోకి వచ్చి చేరడం వల్ల విషపు నురగ తొలగించడానికి ఇబ్బందిపడాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.

6వేల గణేష్ విగ్రహల నిమజ్జనం
సరూర్‌నగర్ చెరువులో వినాయక చతుర్థిని పురస్కరించుకొని సుమారు 6 వేల విగ్రహలను నిమజ్జనం చేశారు. దుర్గాష్టమిని పురస్కరించుకొని దుర్గామాత విగ్రహలను కూడ నిమజ్జనం చేశారు. దీనికి తోడు పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు చెరువులోకి రావడంతో విషపు నురగగా మారిందని అధికారులంటున్నారు. ఇదే మాదిరిగానే బోయిన్‌పల్లిలోని భాను చెరువు హిస్మత్‌పేట వద్ద కూడ ఇదే తరహలో విషపు నురగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications