Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రేమ పేరుతో నమ్మించి... యువతిపై పలుమార్లు లైంగిక దాడి... చివరకు ప్లేటు ఫిరాయించిన యువకుడు

సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చిన ఓ యువతిని ఓ యువకుడు మోసం చేశాడు. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరై... పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. శారీరకంగా ఆమెను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా మాయ మాటలు చెప్పి అబార్షన్ చేయించాడు.కొన్నాళ్లకు పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని మాట మార్చాడు.ఎదురు తిరిగినందుకు ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

అసలేం జరిగింది..

అసలేం జరిగింది..

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 25 ఏళ్ల ఓ యువతి ఆర్నెళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ నల్లకుంటలోని తన సోదరి ఇంట్లో ఉంటోంది. కొన్నాళ్లకు ఓ సినిమాలో అవకాశం రావడంతో షూటింగ్ కోసం వెళ్లింది. అక్కడ మాలపాటి రామకృష్ణ(24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ప్రకాశం జిల్లాకు చెందిన అతను యూసుఫ్‌గూడ సమీపంలోని రహమత్ నగర్‌లో ఉంటూ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు.

శారీరకంగా దగ్గరై... గర్భం దాల్చిన యువతి

శారీరకంగా దగ్గరై... గర్భం దాల్చిన యువతి

బాధితురాలి కథనం ప్రకారం... ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రామకృష్ణ ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె పట్ల చాలా కేరింగ్ కనబరిచేవాడు. అలా కొన్నాళ్లకు ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెకు మరింత దగ్గరయ్యాడు. పలుమార్లు ఆమెను రహమత్ నగర్‌లోని తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడే పిల్లలను కంటే సినీ పరిశ్రమలో అవకాశాలు దెబ్బతింటాయని మళ్లీ ఆమెకు మాయ మాటులు చెప్పాడు.

Recommended Video

    Weather Update : Two More Days Heavy Rains In AP & Telangana | Oneindia Telugu
    పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు...

    పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు...

    బలవంతంగా ఆమెకు గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత నుంచి అనుమానంతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 7న యువతి ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా కొట్టాడు. నానా దుర్భాషలాడాడు. అసలు పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. దీంతో పోలీసులు రామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+