పెళ్లికి నిరాకరించిందని.. పోర్న్ సైట్లో ఫొటో, ఫోన్ నెంబర్ పెట్టాడు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తనను ప్రేమించడం లేదని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కోపంతో ఓ ప్రబుద్ధుడు యువతి ఫొటోను, మొబైల్ నెంబర్‌ను పోర్న్ సైట్లో పెట్టాడు. దీంతో ఆమెకు చాలా మంది నుంచి వచ్చాయి. తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది.

ఈ ఘటనకు సంబంధించి రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తన ఫొటోను, మొబైల్ ఫోన్ నెంబర్‌ను పోర్న్ సైట్లో నమోదుచేశారని సెప్టెంబర్ 19న బాధితురాలు(22) రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫేస్‌బుక్‌ ఖాతాలో తన ఫొటోను తస్కరించి ఈ నిర్వాకానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది.

Hyderabad: Man defames woman, held

కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రియాజుద్దీన్‌ దర్యాప్తు చేపట్టారు. జహనుమా గుల్జార్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌(24) ఈ నిర్వాకానికి పాల్పడినట్లు గుర్తించారు. గతంలో బాధితురాలితోపాటు పనిచేసిన యూసుఫ్‌ ఆరునెలల క్రితం పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకొని ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Rachakonda Cyber Cell police on Wednesday arrested a 24-year-old person, Mohammad Yousuf, on charges of stalking.
Please Wait while comments are loading...