వైఫై స్విచ్చాఫ్ చేసిందని భార్యపై దాడి, ఆసుపత్రిలో చికిత్స

హైదరాబాద్: నిత్యం ఇంటర్నెట్‌లో గడుపుతున్న కారణంగా వైఫై సేవలను నిలిపివేసిన భార్యపై చితకబాదాడు ఓ భర్త. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.

హైద్రాబాద్ సోమాజిగూడలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు సుల్తానా అనే మహిళ తన భర్త అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్‌లో మునిగిపోతుండటం భరించలేకపోయింది. ఈ క్రమంలో వైఫైను ఆఫ్‌ చేయటంతో ఆ భర్తకు చిర్రెత్తుకొచ్చింది.

Hyderabad man thrashes wife for switching off wifi at night

వైఫై బటన్ ఆఫ్ చేయడంతో కోపంతో భార్యపై దాడికి దిగాడు. కోపంలో ఆమెపై విచక్షణరహితంగా కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో సుల్తానాను గురువారం ఉదయం ఆస్పత్రిలో చేరింది.

సుల్తానా ముఖం, ఛాతీ, తలపై గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సుల్తానా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసే ముందు వారిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చే యత్నం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+