వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ మెట్రో: ప్రయాణ టిక్కెట్ ఉంటేనే ఎంట్రీ, మాల్స్, స్టాల్స్‌తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

ప్రారంభోత్సవానికి గడువు సమీపిస్తుండడంతో హైదరాబాద్ మెట్రో రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మెట్రోకు అనుసంధానంగా ఉండే మెగా మాల్స్, ఆయా స్టేషన్లలోని స్టాల్ట్స్ సిద్ధమవుతున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Metro Rail Operations On November 28th | Oneindia Telugu

హైదరాబాద్: ప్రారంభోత్సవానికి గడువు సమీపిస్తుండడంతో హైదరాబాద్ మెట్రో రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మెట్రోకు అనుసంధానంగా ఉండే మెగా మాల్స్, ఆయా స్టేషన్లలోని స్టాల్ట్స్ సిద్ధమవుతున్నాయి.

మన మెట్రో ఘనతలు: ఎన్నో అవార్డులు, ఆదాయమూ భారీగానే!మన మెట్రో ఘనతలు: ఎన్నో అవార్డులు, ఆదాయమూ భారీగానే!

మరోవైపు మెట్రో మాల్స్, షాపింగ్ స్టాల్స్ లో తమ వ్యాపార కేంద్రాలను తెరిచేందుకు వ్యాపారులు కూడా అమితాసక్తి కనబరుస్తున్నారు. మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన వీటిని మెట్రో అధికారులు కేటాయించనున్నారు.

మెట్రో ప్రారంభం రోజునే...

మెట్రో ప్రారంభం రోజునే...

30 కిలోమీటర్ల పొడవుండే నాగోల్-మియాపూర్ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించిన రోజే రెండు మాల్స్ తోపాటు వివిధ స్టాల్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. మూడు మెట్రో కారిడార్లకు అనుసంధానంగా నాలుగు మెగా మాల్స్ నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే రెండు సిద్ధంగా, మిగతా రెండు వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నాయి. మెట్రోలో మిగతా స్టేషన్లతో పోల్చితే.. ఇంటర్‌చేంజ్ స్టేషన్లయిన అమీర్‌పేట్, ఎంజీబీఎస్, పరేడ్‌గ్రౌండ్స్, స్పెషల్ స్టేషన్లయిన హైటెక్‌సిటీ, పంజాగుట్ట, శిల్పారామం/రాయదుర్గం, బేగంపేట స్టేషన్లలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఫుడ్, షాపింగ్, ఎంటర్‌టైన్‌‌మెంట్...

ఫుడ్, షాపింగ్, ఎంటర్‌టైన్‌‌మెంట్...

మెట్రో ప్రయాణికులకు వినోదంతోపాటు షాపింగ్, ఫుడ్‌కోర్టులు, దుస్తులు, ఆభరణాల దుకాణాలు, ఇతర సౌకర్యాలు ఉండేలా షాపింగ్ మాల్స్, స్టాల్స్ ను తీర్చిదిద్దుతున్నారు. ఒక్కసారి మెట్రో మాల్‌లోకి వెళ్తే ప్రతి వస్తువు అందుబాటులో ఉండేలా దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఉరుకులు పరుగుల నగర జీవితంలో మెట్రో మాల్స్ ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేస్తాయని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి స్టేషన్‌లో రిటైల్ బాక్స్‌లు, స్టాల్స్ పేరుతో కూరగాయలు, కిరాణా, అలంకరణ, రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు, ఏటీఎంలు, మెడికల్ స్టోర్స్, లాండ్రీ దుకాణాలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు.

పంజాగుట్ట, ఎర్రమంజిల్, ముసారాంబాగ్‌లో...

పంజాగుట్ట, ఎర్రమంజిల్, ముసారాంబాగ్‌లో...

కారిడార్-1కి అనుసంధానంగా పంజాగుట్ట, ఎర్రమంజిల్, ముసారాంబాగ్‌లో మాల్స్ నిర్మిస్తుండగా, కారిడార్-3లో హైటెక్‌సిటీ ప్రాంతంలో మెట్రోమాల్ నిర్మిస్తున్నారు. ఇందులో పంజాగుట్ట, హైటెక్‌సిటీ మాల్స్ నిర్మాణం పూర్తయి అద్దెకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎర్రమంజిల్, ముసారాంబాగ్ మాల్స్‌ను మరో ఏడాదిలోగా పూర్తిచేసేలా యుద్ధప్రాతిపదికన పనులు సాగుతున్నాయి. పంజాగుట్ట, హైటెక్‌సిటీ ప్రాంతంలోని రెండు మాల్స్‌లో కలిపి 12.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. ఇందులో సగానికిపైగా స్థలం అద్దె/లీజు రూపంలో వివిధ వ్యాపార సంస్థలు తీసుకున్నాయి. వీటిల్లో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.

స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ ఏరియాల్లో కూడా...

స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ ఏరియాల్లో కూడా...

మెట్రో స్టేషన్లలో రిటైల్ స్పేస్‌కు విభిన్న స్థలాలను కేటాయించారు. కాంకర్స్ లెవల్‌లో స్టేషన్‌కు రెండు వైపులా 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణం వరకు వివిధ వస్తు విక్రయ దుకాణాల కోసం కేటాయించనున్నారు. ఇందులో స్టేషన్ రిటైల్ బాక్స్ పేరుతో ఒక్కో దుకాణానికి 100-350 చదరపు అడుగుల స్థలాన్ని ఇవ్వనున్నారు. స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ ఏరియాల్లో కూడా స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిని 1,000-2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్‌చేంజ్ స్టేషన్లలో 10 వేల నుంచి 40 వేల చదరపు అడుగుల స్థలాన్ని స్టోర్స్ కోసం ఉపయోగించనున్నారు. 1500 చదరపు అడుగులు మొదలుకొని స్టోర్ ఏర్పాటుకు కావాల్సినంత స్థలాన్ని పొందవచ్చు. ఎలక్ట్రానిక్ స్టోర్స్, ఎంటర్‌టైన్‌మెంట్ థీమ్స్‌కు సంబంధించిన స్టాల్స్‌కు ఈ స్థలం ఉపయోగపడనుంది.

మొదట వచ్చిన వారికి మొదట...

మొదట వచ్చిన వారికి మొదట...

రిటైలర్, సర్వీస్ ప్రొవైడర్ల అర్హతలను ఎల్‌అండ్‌టీ ఇప్పటికే నిర్ణయించింది. ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు కలిసి ఆయా మాల్స్, స్టాల్స్ కు సంబంధించి లీజు రెంటల్స్‌ను కూడా ఖరారు చేశారు. విస్తీర్ణాన్ని అనుసరించి చదరపు గజానికి రూ.50, రూ.130, రూ.150గా నిర్ణయించారు. పెద్ద స్టోర్స్ అయితే చదరపు గజానికి లీజు రూ.50గా, చిన్న స్టోర్స్‌కు రూ130 నుంచి రూ.150 వరకు ఖరారు చేశారు. మెట్రోమాల్స్‌లో నెలకు చదరపు గజానికి రూ.70-75గా అద్దె నిర్ణయించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన వీటిని మెట్రో అధికారులు కేటాయించనున్నారు.

ప్రయాణ టిక్కెట్ ఉంటేనే లోనికి...

ప్రయాణ టిక్కెట్ ఉంటేనే లోనికి...


హైదరాబాద్ నగరంలో మొదటి మెట్రో రైల్ ఇప్పుడే వస్తుండడంతో చాలామందికి చాలా సందేహాలు కలుగుతున్నాయి. భారతీయ రైల్వే మాదిరిగానే మెట్రోరైలు స్టేషన్‌లోకి వెళ్లడానికి ప్లాట్‌ఫాం టికెట్ కొనుగోలు చేయాలా? స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం వరకు వెళ్లి స్నేహితులకు, బంధువులకు సెండాఫ్ ఇవ్వడానికి అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు మెట్రోరైలు అధికారులు ‘నో' అని సమాధానం ఇస్తున్నారు. ప్రయాణ టికెట్ ఉన్నవారికి మాత్రమే ప్లాట్‌ఫాం ఫ్లోర్‌లోకి వెళ్లే అనుమతి ఉంటుందని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని ఏ మెట్రో స్టేషన్లలోనూ ప్లాట్‌ఫాం టికెట్ విధానం లేదన్నారు. టికెట్ లేని వారు లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే.. టికెట్ కలెక్టివ్ మెషిన్స్ వద్దే నిలిపి వేస్తారని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయని, వారికి సహాయంగా మెట్రో సిబ్బంది ఉంటారని ఆయన పేర్కొన్నారు.

English summary
At one end of the city, while there is a buzz and curiosity surrounding the launch of Hyderabad Metro Rail (HMR), areas such as Punjagutta and Hitech City, which are not part of the initial launch, will also witness a beehive of activity. L&T Metro Rail Hyderabad is gearing up to launch its two malls at Punjagutta and Hitec City subsequent to the launch of the HMR commercial operations on November 28. Built in vast spaces, these two malls house many facilities under one roof. Visitors can shop, dine and have fun, officials said. The leisure of watching movies in a swanky ambiance is being offered by PVR Multiplex on the entire first floor, while the other floors house retail outlets, food courts and so on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X