Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ మెట్రో రైలుకు బ్రేకులే: అసలు సంగతేమిటి?

హైదరాబాద్: హైదరాబాదు మెట్రో రైలు కూత పెడుతుందా, లేదా అనేది సందేహంగానే ఉంది. మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు చెబుతున్నారు. అయితే, మెట్రో రైలు ప్రాజెక్టులో నిపుణుడైన ఇ. శ్రీధరన్ మాటలను బట్టి అది సాధ్యమవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓ ప్రముఖ తెలుగు దినపత్రికతో శ్రీధరన్ హైదరాబాదు మెట్రో రైలు గురించి మాట్లాడారు.

వచ్చే ఏడాది జనవరి 3 నుంచి కూతకు అవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తొలుత రెండు కారిడార్లలో ప్రారంభం కానున్న మెట్రో సేవలను క్రమంగా విస్తరిస్తారని చెబుతున్నారు. జనవరి 3న ప్రధాని నరేంద్ర మోడీ మెట్రో రైలును ప్రారంభించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

నాగోల్-బేగంపేట, మియాపూర్-అమీర్‌పేట కారిడార్లలో తొలుత మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో 2018, జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జాతీయ సైన్సు కాంగ్రెస్‌ సదస్సు జరగనుంది. 3న సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరవుతారని వార్తలు వచ్చాయి.

ప్రధాని కార్యక్రమం ఖరారైందా...

ప్రధాని కార్యక్రమం ఖరారైందా...

ప్రధాని కార్యక్రమం అధికారికంగా ఖరారు కాకపోయినా ఆయన హాజరవుతారనే ప్రభుత్వం భావిస్తోందంటూ వార్తలు వచ్చాయి. మెట్రో రైలు ప్రారంభానికి ముఖ్యఅతిథిగా హాజరవ్వాలంటూ సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రధానమంత్రిని కోరగా, సానుకూలంగా స్పందించినట్లు ఊహాగానాలు చెలరేగాయి. నిజానికి మెట్రో రైలు ప్రారంభోత్సవంపై ప్రభుత్వం పూటకో మాట వినిపిస్తోంది. హైదరాబాద్‌ మెట్రో రైలు(హెచ్‌ఎంఆర్‌) సంస్థ ఒక రకంగా ప్రభుత్వం మరో రకంగా మాట్లాడుతున్నాయి.

ఎప్పుడో కావాల్సింది...

ఎప్పుడో కావాల్సింది...

మెట్రో ప్రాజెక్టు షెడ్యూలు ప్రకారం మొదటి దశ (నాగోల్‌-మెట్టుగూడ 8కి.మీ)ను 2015 ఉగాది నాటికి ప్రారంభించాలి. అందుకు అనుగుణంగా నిర్మాణం పూర్తయి ప్రారంభోత్స వానికి సిద్ధం చేసినా తక్కువ మార్గం వల్ల ప్రయోజనం ఉండదని ప్రభుత్వం చెప్పడంతో వాయిదా వేశారు. రెండోదశ మియాపూర్‌-ఎస్సార్‌నగర్‌ 11 కి.మీ మార్గాన్ని 2015 ఆగస్టు 15 నాటికి పూర్తిచేయాలి. కానీ మూసాపేట, భరత్ నగర్‌ వద్ద రైల్వే లైన్‌పై మెట్రో ఆర్వోబీ నిర్మాణం, మెట్రో స్టేషన్‌ల నిర్మాణం ఆలస్యమైంది.

అప్పుడలా చెప్పారు...

అప్పుడలా చెప్పారు...

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2016, జూన్‌ 2 వ తేదీన ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి వరకు మియాపూర్‌- ఎస్సార్‌నగర్‌ మార్గం సిద్ధం కాకపోవడంతో అదే ఏడాది దసరా నాటికి మెట్రో రైలు ప్రారంభిస్తామని ప్రకటించారు. 2017లో ఉగాది లేదా జూన్‌లో మెట్రో పరుగులు అంటూ హెచ్‌ఎంఆర్‌ ఎం.డి ఎన్వీఎస్‌ రెడ్డి తర్వాత ప్రకటించారు.

ప్రపంచంలోనే అతి పెద్దది...

ప్రపంచంలోనే అతి పెద్దది...

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాదు మెట్రో రైలు నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి ఇది హైదరాబాదు రవాణాకు ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతుంది. 2016-2017 కల్లా 15 లక్షల ప్రయాణీకులను వారి గమ్యాలకు చేర్చుతుందని అంచనా వేశారు. మెట్రో రైలు వినియోగంలోకి వస్తే ఇది ప్రపంచంలో అతి ఎత్తైన మెట్రో రైలుగా పేరు సంపాదిస్తుంది. ఇది హైదరాబాదును ఆధునికంగా, గ్రీన్ సిటీగా మారుస్తుంది

శ్రీధరన్ మాటలు ఇవీ..

శ్రీధరన్ మాటలు ఇవీ..

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఏమాత్రం లాభదాయకం కాబోదని, దాని ఆపరేషన్‌ మొదలుపెట్టిన నాటి నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థ భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందని, అదే సమయంలో బ్యాంకులకు రుణాల చెల్లింపు చేయాల్సి ఉంటుందని. అందుకే అది ఆపరేషన్స్‌ ప్రారంభించడానికి జంకుతోందని శ్రీధరన్ అసలు విషయం చెప్పేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు పలుసార్లు అడ్డంకులు కల్పించిందని అందుకు తగిన నష్టాన్ని చెల్లించాలని ఎల్‌అండ్‌టీ డిమాండ్‌ చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందన్నారు. పీపీపీ మోడల్‌ విజయవంతం కాదనడానికి హైదరాబాద్‌ మెట్రో ఒక ఉదాహరణ అని అన్నారు.

 అలా ఇచ్చినా కూడా...

అలా ఇచ్చినా కూడా...

ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కోసం 300 ఎకరాల భూమి ఎల్‌అండ్‌టీకి ఇచ్చిన విషయాన్ని కూడా శ్రీధరన్ గుర్తు చేశారు. అయితే ఆస్తుల విలువలు తగ్గడం వల్ల రియల్‌ ఎస్టేట్‌ ద్వారా లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడంలేదని, అందుకే ప్రాజెక్టు ప్రారంభించిన ఏడేళ్ల తర్వాత కూడా ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోలో కనీసం ఒక సెక్షన్‌ను కూడా ప్రారంభించడానికి సాహసం చేయడంలేదని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+