వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైద్రాబాద్ మెట్రో రైలు: నో పార్కింగ్ ఏరియా, లిక్కర్‌ బాటిల్‌తో రైలులోకి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైద్రాబాద్ మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.హైద్రాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేసే ప్రయాణీకులకు ఓ సమస్య వేధిస్తోంది. ఈ రైలులో ప్రయాణం చేసే ప్రయాణీకులకు తమ వాహనాలు పార్కింగ్ చేసుకొనే సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.

మెట్రోరైలు: పిల్లర్లతో అడ్రస్, జీపీఎస్, గూగుల్‌ మ్యాప్‌తో లింక్మెట్రోరైలు: పిల్లర్లతో అడ్రస్, జీపీఎస్, గూగుల్‌ మ్యాప్‌తో లింక్

హైద్రాబాద్ మెట్రో‌ రైలును నవంబర్ 28వ, తేదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.మెట్రో రైలు సేవలను జాతికి అంకితం చేశారు. అయితే మెట్రో రైలులో ప్రయాణం చేసేందుకు ప్రయాణీకులు పోటీలు పడుతున్నారు.

హైద్రాబాద్ మెట్రో‌రైలు: క్షణాల్లోనే గమ్యస్థానానికి, టీ సవారీ యాప్‌ ప్రత్యేకతలివేహైద్రాబాద్ మెట్రో‌రైలు: క్షణాల్లోనే గమ్యస్థానానికి, టీ సవారీ యాప్‌ ప్రత్యేకతలివే

మొదటి రోజే సుమారు లక్ష మందికి పైగా మెట్రో రైలులో ప్రయాణం చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే మెట్రో‌రైలులో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కానీ, ఈ రైలులో ప్రయాణం చేసేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణీకుల వాహనాలను పార్కింగ్ చేసే సదుపాయం కల్పించడంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోలేదు.

మెట్రోరైల్ షాక్: రూల్స్ బ్రేక్ చేస్తే 10 ఏళ్ళ జైలు, జరిమానామెట్రోరైల్ షాక్: రూల్స్ బ్రేక్ చేస్తే 10 ఏళ్ళ జైలు, జరిమానా

షాక్: మెట్రోరైలులో ఇలా చేస్తే జైలుకే, మియాపూర్‌ టూ అమీర్‌పేటకు మోడీ, కెసిఆర్షాక్: మెట్రోరైలులో ఇలా చేస్తే జైలుకే, మియాపూర్‌ టూ అమీర్‌పేటకు మోడీ, కెసిఆర్

మెట్రో రైలు ప్రయాణీకులకు పార్కింగ్ కష్టాలు

మెట్రో రైలు ప్రయాణీకులకు పార్కింగ్ కష్టాలు

మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద సరైన పార్కింగ్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.దీంతో ప్రయాణీకులు తమ వాహనాలను పుట్‌పాత్‌లపైనే నిలుపుతున్నారు.అంతేకాదు సమీప ప్రాంతాల్లోనే నిలుపుతున్నారు. దీంతో మెట్రో రైల్వేస్టేషన్లు ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.

వాహనాలను తీసుకెళ్ళిన పోలీసులు

వాహనాలను తీసుకెళ్ళిన పోలీసులు

అమీర్‌పేట్‌ ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ వద్ద గురువారం వాహనాలను ఇష్టమొచ్చినట్టుగా పార్క్‌ చేయడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను అక్కడి నుంచి తరలించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే అమీర్‌పేట స్టేషన్‌లో పార్కింగ్‌ వసతి కల్పించకపోవడం పట్ల జనం మండిపడుతున్నారు. వాహనాలను తరలించడంతో పోలీస్‌స్టేషన్లకు చేరుకొని తమ వాహనాలను తీసుకొన్నారు.

 ఈ స్టేషన్లలో ఇబ్బందులే

ఈ స్టేషన్లలో ఇబ్బందులే

చాలా స్టేషన్లలో వాహనాలు నిలిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సివస్తోంది. పరేడ్‌ గ్రౌండ్‌, సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ సౌకర్యం లేదు. నాగోల్, ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ, హబ్సిగూడ, తార్నాక స్టేషన్లలో ద్విచక్ర వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం ఉంది. కానీ, కార్లు, బస్సులు, క్యాబ్స్‌ నిలిపేందుకు స్థలం లేదు.

త్వరలోనే పార్కింగ్ సౌకర్యం

త్వరలోనే పార్కింగ్ సౌకర్యం

మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద పార్కింగ్‌ ప్రదేశాలను సిద్ధం చేస్తున్నామని మెట్రో రైల్వే ఎండి ఎన్‌విఎస్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే ఇబ్బందులు తొలగిపోతాయని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. పార్కింగ్‌ చార్జీలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మెట్రోరైలు ప్రయాణ చార్జీలు ఎక్కువేమీ లేవని ఆయన చెప్పారు.పార్కింగ్‌ పేరుతో ఎవరూ ఛార్జీలు వసూలు చేయొద్దని ఎన్‌విఎస్ రెడ్డి ప్రకటించారు.

 లిక్కర్ బాటిల్‌తో మెట్రో రైలులోకి

లిక్కర్ బాటిల్‌తో మెట్రో రైలులోకి

అమీర్ పేట్ మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు లిక్కర్‌ బాటిల్‌‌తో రావడం కలకలం రేపింది. లిక్కర్‌ బాటిల్‌తో వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.టికెట్ తీసుకున్నాక నీళ్లు అడిగితే.. బయటికి వెళ్ళి తెచ్చుకోమని మెట్రో సిబ్బంది చెప్పారని అతను తెలిపాడు. తీరా వాటర్‌ బాటిల్‌తో వస్తే పోలీసులు అనుమతిలేదంటూ.. లోపలికి రానివ్వలేదని, దీంతో కోపం వచ్చి లిక్కర్ బాటిల్‌ను మెట్రో స్టేషన్‌లోకి తీసుకొచ్చానని అతను తెలిపాడు.

English summary
Hyderabad Metro Rail authorities are not yet ready or clear about ‘sufficient parking’ space at each of the 24 stationsor last mile connectivity to and from the stations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X