హైదరాబాద్ మెట్రో రైల్ రెండవదశ విస్తరణ.. కేంద్రంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్!

హైదరాబాద్ ప్రగతికి బాటలు వేసే, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే మెట్రోరైలు రెండవదశ విస్తరణపైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించింది. ఈ మేరకు కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు పొందేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. విస్తరణకు అవసరమైన కేంద్ర అనుమతులను ఎలా పొందాలన్న అంశంపైన హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో రాష్ట్రానికి చెందిన ఎంపీల కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు సంస్థ అవగాహన సదస్సును నిర్వహించింది.

మెట్రో రైలు రెండవ దశకు కేంద్ర అనుమతులకు ప్లాన్
ఈ సదస్సులో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనగా, రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు హాజరై మెట్రోరైలు రెండవదశకు కేంద్రం నుంచి అనుమతులు పొందాలంటే ఏం చేయాలి అన్న దానిపైన సమగ్రంగా చర్చించారు. జూలై 21వ తేదీనుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, పార్లమెంటు సమావేశాల వేదికగా మెట్రోరైలు రెండవదశ విస్తరణకు సంబంధించి కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని మంత్రులు ఎంపీలకు సూచించారు.

Hyderabad Metro Rail Phase 2 Expansion Revanth govt Master Plan to pressure the Center

Take a Poll

మెట్రో రైల్ రెండవ దశపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
రెండో దశ విస్తరణ కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలా పార్టీలకతీతంగా కృషి చేయాలని ఎంపీలను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు హెచ్ఏఎంఎల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రైలు ప్రతిపాదిత విస్తరణ కారిడార్ల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు సమగ్రంగా అర్థమయ్యేలా వివరించారు. రెండవ దశ మెట్రో విస్తరణను 2a, 2b అనే రెండు భాగాలుగా ప్రతిపాదించినట్టు అధికారులు తెలిపారు.

కేంద్రానికి పంపిన ప్రతిపాదనల వివరాలు చెప్పిన హెచ్ఏఎంఎల్ ఎండి
2ఏ కింద ఐదు కారిడార్లు ఉండగా 76.4కిలోమీటర్ల పొడవుతో 24,269కోట్ల రూపాయల వ్యయంతో ఇది నిర్మించబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను గత నవంబర్ లోనే కేంద్రానికి పంపినట్టు తెలిపారు. అలాగే 2బి లో 86.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ కారిడార్ల కోసం 19,579కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారని, దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా జూన్ 21వ తేదీన కేంద్రానికి సమర్పించామని ఎన్విఎస్ రెడ్డి ఎంపీలకు తెలిపారు.

త్వరలోనే మోదీని కలిసే ప్లాన్
ఇక ఇప్పటికే మెట్రో రెండో దశ విస్తరణ కోసం తాము కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, ఈ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మెట్రో రెండో దశ పనులకు అనుమతులు తెచ్చుకుని పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో విస్తరణ ప్రాజెక్టు హైదరాబాద్ భవిష్యత్తు రవాణా అవసరాలకు చాలా ముఖ్యమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+