తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. తప్పుకున్న L&T
హైదరాబాద్ మెట్రోపై కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతికి రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. దీంతో మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకుంది. ఈ మొదటి దశ ప్రాజెక్టును రేవంత్ సర్కార్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ అప్పుల టేకోవర్ కు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్‌అండ్‌టీ సంస్థ తప్పుకుంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం చేతికి మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఈమేరకు ఉదయం మెట్రో అధికారులతో సీఎం రేవంత్ భేటి అయ్యారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య అంగీకారం కుదిరింది. ప్రస్తుతం ఎల్‌అండ్‌టీ సంస్థకు ఉన్న రూ.13 వేల కోట్ల అప్పును ప్రభుత్వం టేకోవర్ చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఎల్‌అండ్‌టీకి రూ.2,100 కోట్ల డబ్బు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ఇక హైదరాబాద్ మెట్రో 69 కి.మీ. తొలి దశను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.22 వేల కోట్లతో నిర్మించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ మెట్రో భారీ నష్టాల దృష్ట్యా మెట్రోని నడిపించడం తమ వల్ల కాదంటూ ఎల్ అండ్ టీ సంస్థ చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. బాకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక భారం పెరిగిపోయిందని లేఖలో వివరించింది. మెట్రోకు ఇప్పటికే రూ. 2,500 కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లించాలంటూ లేఖలు రాసినా ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదని ఎల్ అండ్ టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. దీంతో మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకుంది. ఈ మొదటి దశ ప్రాజెక్టును రేవంత్ సర్కార్ కొనుగోలు చేయనుంది.












Click it and Unblock the Notifications