బాలిక మిస్సింగ్, లవర్ తో కలిసి ఆత్మహత్య..
హైదరాబాద్ : కూకట్ పల్లిలో మిస్సయిన 16ఏళ్ల బాలిక, తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరానప్పటికీ.. భద్రాచలంలోని ఓ లాడ్జ్ లో పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. గత మంగళవారం ఇంటి నుంచి స్కూల్ కి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. మిస్సయిన బాలిక స్థానికంగా ఉండే ఓ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, స్కూల్ నుంచి బయటకు వచ్చేముందు వాచ్ మెన్ ఫోన్ నుంచి రవి అనే వ్యక్తికి బాలిక ఫోన్ చేసినట్టుగా పోలీసుల దృష్టికి రావడంతో విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఫోన్ నంబర్, దాని సిగ్నల్స్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు రవి అనే వ్యక్తి భద్రాచలం నుంచి బాలికతో ఫోన్ లో మాట్లాడినట్టుగా గుర్తించారు. దీంతో కేసును చేధించేందుకు ఓ ప్రత్యేక బృందం భద్రాచలం వెళ్లగా, అక్కడి ఓ లాడ్జ్ లో బాలికతో పాటుగా ఆమె బాయ్ ఫ్రెండ్ రవి ఇద్దరు ఉన్నట్టుగా గుర్తించారు.
అయితే, లాడ్జ్ రూమ్ లో లోపలి నుంచి డోర్ లాక్ చేసుండడంతో, తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికెళ్లిన పోలీసులు, అప్పటికే నోట్లో నుంచి నురగలు కక్కుంటున్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు ఆదివారం కన్నుమూశారు.
కాగా, కూకట్ పల్లికి చెందిన ఆ బాలికకు, రవికి మధ్యన పరిచయం ఎలా ఏర్పడిందన్న దానిపై పోలీసులు ఆరా తీయగా, బాలిక అమ్మమ్మ వాళ్ల ఊరైన గుంటూరు జిల్లా పోతర్లంకలో ఇద్దరికీ పరిచయం ఏర్పడినట్టుగా గుర్తించారు. ఎండాకాలం సెలవుల్లో భాగంగా అక్కడికి వెళ్లిన బాలికకు లారీ డ్రైవర్ గా పనిచేసే రవికుమార్ అనే 23 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత బాలిక కూకట్ పల్లికి తిరిగి వచ్చినా.. ఇద్దరి మధ్య ఫోన్ల ద్వారా మరింత సాన్నిహిత్యం పెరిగింది. ఇదిలా కొనసాగుతుండగానే గత మంగళవారం నాడు బాలిక మిస్సవడం, అటు తర్వాత బాలికతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ భద్రాచలం లాడ్జ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డం వెనుక కారణాలను చేధించే పనిలో పడ్డారు పోలీసులు.












Click it and Unblock the Notifications