బీటెక్ విద్యార్థిని దేవి మృతి మిస్టరీ: ప్రశ్నలు సంధించిన సోదరి

హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థిని దేవి మృతి చెందిన సంఘటన స్థలానికి పోలీసులు గురువారం వచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులను దేవి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అడ్డుకున్నారు. పోలీసులు ఈ కేసులో మెతక వైఖరితో వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

తమకు న్యాయం జరగాలని, పోలీసులు కేసు విషయంలో సీరియస్‌గా లేరని వారు ఆరోపిస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ స్నేహితులు, బంధువులు నినాదాలు చేశారు. దేవికి న్యాయం జరగాలన్నారు. ఈ సందర్భంగా దేవి సోదరి పలు అనుమానాలను లేవనెత్తారు.

ఇప్పుడు రావడం ఏమిటి?

ఆమె మాట్లాడుతూ.. తాను ఆ రోజు పబ్‌కు వెళ్లలేదని చెప్పారు. ప్రమాదం జరిగిన కాసేపటికే పోలీసులు ఆ రోజు కారును తీసుకు వెళ్లారన్నారు. ప్రమాదం జరిగిన అయిదు రోజుల తర్వాత ఇప్పుడు సంఘటన స్థలానికి రావడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రమాదం జరిగిందని చెబుతున్న కారు అప్పుడు నీట్‌గా ఉందని, బంపర్ చెడిపోలేదని చెప్పారు. అదే సమయంలో ప్రమాదం జరిగితే చెట్టు పడిపోవాలని, కానీ అది పడిపోలేదన్నారు. కానీ ఇప్పుడు కారు చెడిపోయి ఉందని, ఇలా ఎందుకు ఉందన్నారు.

Hyderabad mystery accident: Techie's father alleges assault

కారును అప్పుడే ఎందుకు తీసుకు వెళ్లారని, ఇప్పుడు ఎందుకు తీసుకు వచ్చారని ప్రశ్నించారు. అలాగే, ఫుట్ వేర్ బాడీకే ఉన్నాయని, ఇప్పుడు కారులో ఉన్నాయని, ఇవి తమకు ఎన్నో అనుమానాలను కలిగిస్తున్నాయన్నారు. తమకు ఫోన్ ఇచ్చారని, కానీ అప్పుడే చెప్పులు ఎందుకు ఇవ్వలేదన్నారు.

తాను ప్రమాదానికి ముందు ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో వస్తున్నానని తన సోదరి చెప్పిందన్నారు. తాము ప్రమాదం జరిగినప్పుడు సంఘటన స్థలానికి రాలేదని, వీడియో ఫుటేజీలో చూస్తే మాత్రం వారు చెప్పినవి తప్పని అర్థమవుతోందన్నారు.

ప్రమాదం జరిగినప్పుడు కారు మంచిగానే ఉందని, ఇఫ్పుడు మాత్రం తొక్కుతొక్కు ఎందుకు చేశారని మరొకరు ప్రశ్నించారు. అసలు కారుకు అప్పుడు ఏం కాలేదన్నారు. ఇప్పుడు ఇలా తుక్కు తుక్కు చేసి తీసుకు రావడమేమిటని ఇంకొకరు ప్రశ్నించారు. కారును డామేజ్ చేయవలసిన అవసరం, ఐదు రోజుల తర్వాత రావాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.

హత్య చేయాల్సిన అవసరం లేదు: భరతసింహా రెడ్డి

దేవిని హత్య చేయాల్సిన అవసరం తనకు లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న భరతసింహా రెడ్డి అన్నారు. దేవీ ప్రమాదంలోనే చనిపోయిందన్నారు. జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో నిందితుడు భరత సింహా రెడ్డిని పోలీసులు విచారించారు.

నిష్పక్షపాతంగా విచారణ: పోలీసులు

తాము నిష్పక్షపాతంగా దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు మేం దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. దర్యాఫ్తు చేసి వాస్తవాలను బయటకు తీస్తామన్నారు. బాధితుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని, దయచేసి విచారణకు సహకరించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+