చికెన్ వంటకాల ఆర్డర్‌లో హైదరాబాద్ దేశంలోనే ఫస్ట్, వెరైటీ రుచులతో..

Posted By:
Subscribe to Oneindia Telugu
  హైదరాబాద్ దేశంలోనే ఫస్ట్, వెరైటీ రుచులతో : క్రికెట్ మ్యాచ్‌ ఉన్నప్పుడు ఐతే..! | Oneindia Telugu

  హైదరాబాద్: చికెన్ వంటకాల ఆర్డర్‌లలో హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ ఉంది. స్విగ్గీ ఆన్ లైన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

   హైదరాబాద్ మొదటి స్థానం

  హైదరాబాద్ మొదటి స్థానం

  దేశంలోనే చికెన్ ఆర్డర్లలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటే బెంగళూరు,త ఢిల్లీ, కోల్‌కతా, పుణే ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

   లంచ్, డిన్నర్ సమయాల్లోనే కాకుండా

  లంచ్, డిన్నర్ సమయాల్లోనే కాకుండా

  సాధారణంగా లంచ్, డిన్నర్ టైమ్‌లలోనే చాలామంది బిర్యానీకి ఆర్డర్ చేయడం పరిపాటి. కానీ హైదరాబాదీయులు చాలామంది సాయంత్రం స్నాక్స్ టైంలోను చికెన్ బిర్యానీని అడుగుతున్నారట. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోందట.

   వీకెండ్స్‌లలో చికెన్ వంటకాలపై మక్కువ

  వీకెండ్స్‌లలో చికెన్ వంటకాలపై మక్కువ

  వారం రోజులపాటు వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపకాలు, వ్యాపారాలతో క్షణం తీరికలేకుండా గడుపుతున్న నగరవాసులు వారాంతాల్లో చికెన్ వంటకాలు ఎక్కువగా తింటున్నట్లు సర్వేలో వెల్లడైందంట.

   మ్యాచ్‌లు ఉన్నప్పుడు మరీ ఎక్కువ

  మ్యాచ్‌లు ఉన్నప్పుడు మరీ ఎక్కువ

  ఆదివారం రాత్రి డిన్నర్ సమయంలోను ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయట. ఐపీఎల్, ఐసీసీ టెస్ట్, వన్డే మ్యాచ్‌లు ఉన్న రోజుల్లోను చికెన్ వంటకాల ఆర్డర్లు భారీగా వచ్చిపడుతున్నట్లు తేలిందట. సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో ఈ ఆర్డర్లుంటున్నాయని అంటున్నారు. సాధారణ రోజుల్లోను ఆర్డర్లు ఉన్నప్పటికీ మ్యాచ్‌ల సందర్భంగా విపరీత గిరాకీ ఉంటుందట.

   వెరైటీలను ఇష్టపడుతున్నారు

  వెరైటీలను ఇష్టపడుతున్నారు

  రోజులో దాదాపు అన్ని వేళల్లో చికెన్ వైరైటీలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు హైదరాబాదీయులు. ప్రధానంగా చికెన్ శాండ్ విచ్, చికెన్ బర్గర్, చికెన్ బిర్యానీలకే బ్రేక్ ఫాస్ట్ టైంలో ఆరగించేందుకు మక్కువ చూపుతున్నారు. లంచ్‌లో చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, తందూరి చికెన్, చికెన్ లాలీపప్, చికెన్ సబ్, చికెన్ 65 తదితరాలను తింటున్నారు. స్నాక్స్ టైంలో బిర్యానీ, బర్గర్లతో పాటు చికెన్ రోల్, చికెన్ మోమో, చికెన్ షా వర్మ, డిన్నర్‌లో చిల్లీ చికెన్, చికెన్ టిక్కా, గ్రిల్డ్ చికెన్, చికెన్ బిర్యానీ, చికెన్ రోల్ తదితరాలను ఇష్టపడుతున్నారట.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  One online survey revealed that Hyderabad is on top in chicken orders in India. Bengaluru is in second place and Delhi is in third place.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి