Video:100 కోట్ల సైకిల్ ట్రాక్ పై అంత్యక్రియలు-సీఎం తెలుసంటూ బెదిరింపులు..!!

భారతదేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎందుకు అభివృద్ధి కావడం లేదంటే.. ఇప్పుడు మనం ఈ వార్తలో చెప్పుకునే కొందరు ప్రబుద్ధుల వల్లే. మీరు చేస్తోంది తప్పు అని ప్రశ్నిస్తే నాకు ముఖ్యమంత్రి తెలుసు, ఆ మంత్రి తెలుసు, అతగాడు తెలుసు, ఇతగాడు తెలుసు అంటూ ప్రగల్భాలు పలికే పెద్దమనుషులు... తాము చేస్తుంది ఎంతటి తప్పో గ్రహించలేకపోతున్నారు. ఇలాంటి ఘటనే ఔటర్ రింగ్ రోడ్ పై వెలుగు చూసింది.బుధవారం డిసెంబర్ 10వ తేదీన ఓఆర్ఆర్‌ వద్ద ఉన్న సైక్లింగ్ ట్రాక్ పై కొందరు వ్యక్తులు అంత్యక్రియల్లో భాగంగా...నెరవేర్చాల్సిన కొన్ని బాధ్యతలను బాధ్యత లేకుండా నిర్వహించారు.

సైక్లింగ్ ట్రాక్ పై అంత్యక్రియలు
హైదరాబాదుకు మణిహారంగా మారిన ఔటర్ రింగ్ రోడ్ సోలార్ ఆధారిత సైక్లింగ్ ట్రాక్ పై కొందరు వ్యక్తులు అంత్యక్రియలు నిర్వహించడంపై నెటిజెన్లు భగ్గుమంటున్నారు. రోజూ సైక్లింగ్ చేసే వారు ఇదేం పని అని అడిగితే తనకు సీఎం తెలుసంటూ వీరిని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు హిందూ సంప్రదాయంలో భాగంగా తలనీలాలు అర్పిస్తారు. అయితే తలనీలాలను సైక్లింగ్ ట్రాక్ పై అర్పించడాన్ని సైక్లిస్టులు, నెటిజెన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధలో ఉన్న ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుతూనే సైక్లింగ్ ట్రాక్ పై ఇలాంటివి చేయడం సరికాదని చెబుతున్నారు.

hyderabad-orr-cycling-track-row-final-rites-performed-cyclists-threatened-withi-know-cm-line

నాకు సీఎం తెలుసంటూ..
ఇది సైక్లింగ్ ట్రాక్ ఇలాంటివి ఇలా చేయకూడదని సైక్లిస్టులు అడ్డుపడినప్పుడు అందులో ఓ వ్యక్తి నాకు సీఎం రేవంత్ రెడ్డి తెలుసు, వారు మా బంధువులు అంటూ సైక్లిస్టులను బెదిరించే ప్రయత్నం చేశారు. అందులో ఓ వ్యక్తి అయితే తాను సర్పంచ్‌ అంటూ చెప్పుకొచ్చాడు. ఎవరి బంధువైనా కావొచ్చు... కానీ ఇది పబ్లిక్ కోసం కట్టిన సైకిల్ ట్రాక్ అని నెటిజెన్లు గుర్తు చేస్తున్నారు. హైదరాబాదు లాంటి మహానగరం, ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మన నగరంలో ఇక్కడి ఇన్ఫ్రాస్టక్చర్‌ను నాశనం చేసే పనులు చేస్తుంటే ఊరుకోవాలా అంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.మన హైదరాబాద్‌ను మనం రక్షించుకోవాలంటూ సైక్లిస్టులు పిలుపునిస్తున్నారు. అన్ని అడ్డంకులు దాటుకుని హైదరాబాద్ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే.. ఇలాంటి వారు కొందరు నగరానికి అపఖ్యాతి తెచ్చేలా వ్యవహరిస్తున్నారు.

నగర ఇమేజ్ డ్యామేజ్
భారత్‌లోనే తొలి సైక్లింగ్ ట్రాక్ మన హైదరాబాదులో ఉండటం గర్వకారణమని అలాంటిది... ఇలాంటి మనుషులతో నగర ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని ఓ సైక్లిస్ట్ అభిప్రాయపడ్డారు.వీరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వద్ద సైక్లింగ్ ట్రాక్‌ను రూ.100 కోట్లతో నిర్మించారు.నానక్‌రామ్‌‌గుడ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడెమీ వరకు మొత్తంగా 8.5 కిలోమీటర్లు మేరా తొలి స్ట్రెచ్ ఉండగా... నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్లు మేరా రెండవ స్ట్రెచ్ ఉంది. 24 గంటలు తెరిచి ఉండే ఈ సైక్లింగ్ ట్రాక్ మొత్తం సౌరవిద్యుత్‌తో నడుస్తుంది.16 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మొత్తం 16వేల సోలార్ ప్యానెల్‌లు అమర్చారు.ఇక ప్రతి రోజు సైక్లిస్టులు ఇక్కడ సైక్లింగ్ చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు.

అలాంటి ఒక గొప్ప ప్రదేశంలో గుండు కొట్టించుకోవడం ఆ తర్వాత అక్కడికే ఒక వాటర్ ట్యాంకర్‌ను పిలిపించుకుని స్నానాలు చేయడంపై సైక్లిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు చాలా ప్రాంతాలు ఉండగా.. ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్‌ను వినియోగించడంపై నెటిజెన్లు తప్పుబట్టారు. ఈ సైకిల్ ట్రాక్ పై నిత్యం సైక్లింగ్ చేసే సైక్లిస్టులు ఈ దృశ్యం చూసి చాలా ఆవేదన చెందారు. ఏది ఏమైనప్పటికీ... ఇలాంటి చర్యలు దిగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+