గర్బిణి హత్య వెనుక వివాహేతర సంబంధమే?: అర్థరాత్రి ఆ ఇద్దరూ.. నిందితుడు అతనే..
Recommended Video

హైదరాబాద్: గచ్చిబౌలిలో ఎనిమిది నెలల గర్భిణిని ముక్కలుముక్కలుగా చేసి గోనెసంచుల్లో కుక్కి పడేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత నెల 30న వెలుగుచూసిన ఈ హత్యకు సంబంధించి పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సీసీటీవి ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. బైక్‌పై వచ్చిన ఓ జంట ఆ శవాన్ని అక్కడ పడేసి వెళ్లినట్టు గుర్తించారు.

అర్థరాత్రి సమయంలో..:
అర్థరాత్రి సమయంలో ఓ మహిళతో పాటు యమహా బైక్‌పై వచ్చిన వ్యక్తి.. మొదట బొటానికల్ గార్డెన్ పరిసరాల్లో రెండు రౌండ్లు కొట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఎవరైనా చూస్తున్నారా?.. లేదా? అన్న విషయాన్ని నిర్దారించుకున్న తర్వాత.. వారిద్దరి మధ్య ఉన్న ఒక మూటను రోడ్డు పక్కన పడేసి వెళ్లారు.

మూటలో శవాన్ని కుక్కి..:
రోడ్డుపై ఆ మూటను పడేసి వెళ్లిన తర్వాత.. అది గమనించిన ఓ దుకాణం యజమాని దాన్ని తీసుకెళ్లి 20మీటర్ల దూరంలో పడేశాడు. ఆపై బల్దియా సిబ్బంది కొంతమంది దాన్ని గుర్తించి మూటను విప్పి చూశారు. అందులో యువతి శవాన్ని ముక్కలు ముక్కలు చేసి పడేసినట్టు గుర్తించారు.

ఎటువైపు వెళ్లారు.:
మూటను అక్కడ పడేసిన తర్వాత నిందితులు ఎటువైపు వెళ్లారనే విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. బొటానికల్ గార్డెన్ పరిసర ప్రాంతాల నుంచి వైట్‌ఫీల్డ్స్ జంక్షన్ మీదుగా అంజయ్య నగర్, సిద్ధిఖ్‌నగర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని సీసీటీవి ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు.

అతడే నిందితుడు.. :
నిందితుడు సిద్ధిఖ్‌నగర్ ప్రాంతంలోనే ఉండే అమర్‌కాంత్‌గా పోలీసులు గుర్తించారు. హత్య ఉదంతం తర్వాత అతను పరారీలో ఉన్నట్టు తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ఒక స్పెషల్ టీమ్‌ను నియమించినట్టు చెప్పారు.

వివాహేతర సంబంధమే..:
వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమైందని తెలుస్తోంది. అప్పటికే వివాహితుడైన అమర్‌కాంత్ మహారాష్ట్రకు చెందిన మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి కోసం ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఇదే క్రమంలో ఆమెను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో విజయ్ కుమార్ ఆమెను హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు పట్టుబడితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications