ఫేక్ సర్టిఫికెట్ల రాకెట్: హైదరాబాద్ పోలీసుల దూకుడు; వీసీతో సహా ముగ్గురు ఉన్నతాధికారులు అరెస్ట్!!

అంతర్ రాష్ట్ర నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల రాకెట్ కేసులో ముగ్గురు యూనివర్సిటీ ఉన్నతాధికారులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్ లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ కేంద్రంగా కొనసాగుతున్న ఫేక్ సర్టిఫికెట్ల దందా గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ పోలీసుల బృందం భోపాల్‌లోని విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మంగళవారం నాడు అరెస్ట్ చేసింది. మార్చి 2022లో అంతర్ రాష్ట్ర నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసుకు సంబంధించి ఈ అరెస్ట్ లను చేసింది.

యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ తో పాటు మరో ఇద్దరు అరెస్ట్

యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ తో పాటు మరో ఇద్దరు అరెస్ట్

భోపాల్ పోలీసు కమిషనరేట్‌లోని కీలక వర్గాల సమాచారం ప్రకారం, అరెస్టయిన ముగ్గురిలో యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్, మాజీ వైస్ చాన్సలర్ మరియు ఒక విభాగం అధిపతి కూడా ఉన్నారని సమాచారం. హైదరాబాద్ పోలీసు బృందం మంగళవారం ఉదయం భోపాల్ చేరుకుంది. మొదట హోషంగాబాద్ రోడ్‌లోని సంబంధిత విశ్వవిద్యాలయానికి వెళ్లడానికి స్థానిక పోలీసుల సహాయం కోరింది. అనంతరం ముగ్గురు ప్రైవేట్ యూనివర్సిటీ అధికారులను అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీసులు బుధవారం భోపాల్‌లో అవసరమైన న్యాయపరమైన లాంఛనాలను పూర్తి చేసి, అరెస్టు చేసిన ముగ్గురితో కలిసి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

ఫిబ్రవరిలో భోపాల్ యూనివర్సిటీ ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు చేసిన పోలీసులు

ఫిబ్రవరిలో భోపాల్ యూనివర్సిటీ ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు చేసిన పోలీసులు

ఫిబ్రవరి 2022లో, హైదరాబాద్ పోలీసులు భోపాల్‌లోని ప్రైవేట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో సహా 10మంది వ్యక్తులను అరెస్టు చేయడం ద్వారా నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలను విక్రయించే రాకెట్‌ను ఛేదించారు. పరీక్షలలో ఫెయిల్ అయిన వారిని, విద్యను పూర్తి చేయలేని విద్యార్థులను ఈ ఫేక్ సర్టిఫికెట్ల రాకెట్ లక్ష్యంగా చేసుకుంది. ఇక పోలీసుల తనిఖీలలో పలు నకిలీ సర్టిఫికెట్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

కోర్సును బట్టి నకిలీ సర్టిఫికెట్ కు ఓ రేటు

కోర్సును బట్టి నకిలీ సర్టిఫికెట్ కు ఓ రేటు

ఫిబ్రవరిలో నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌ను ఛేదించే సమయంలో, హైదరాబాద్ పోలీసులు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెహిదీపట్నంలో 'ప్రైడ్ ఎడ్యుకేషనల్ అకాడమీ' అనే నకిలీ విద్యా కన్సల్టెన్సీపై దాడి చేసి ఒక నిందితుడిని పట్టుకున్నారు. నిందితులు నకిలీ సర్టిఫికెట్ల ధరల పట్టికను తయారు చేశారు. ఇంజినీరింగ్, బీటెక్ డిగ్రీలు రూ.3 లక్షలు, బీకామ్, బీఏ డిగ్రీలు రూ.1.5 లక్షలు, బీఎస్సీ డిగ్రీ సర్టిఫికెట్ రూ.1.75, ఎంబీఏ డిగ్రీకి రూ.2.75 లక్షలుగా ధరను నిర్ణయించి సర్టిఫికెట్లను విక్రయిస్తున్నారు.

నకిలీ సర్టిఫికెట్ల ద్వారా 100 కోట్ల సంపాదనకు ప్లాన్

నకిలీ సర్టిఫికెట్ల ద్వారా 100 కోట్ల సంపాదనకు ప్లాన్

ఈ రాకెట్‌లో మూడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఒకటి భోపాల్ (MP), మరొకటి సాగర్ (MP) మరియు మరొకటి సహరన్‌పూర్ (UP)లో ఉన్నాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ లను ఇవ్వటానికి దందా మొదలు పెట్టిన యూనివర్సిటీ అధికారులు దాదాపు వెయ్యి వరకు నకిలీ పట్టాలను సిద్ధం చేసుకున్నారు. వీటి ద్వారా 70 కోట్ల నుండి 100 కోట్ల రూపాయలు సంపాదించటానికి పక్కా స్కెచ్ వేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+