హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సైంటిస్టులకు సైతం సాధ్యం కానిది.. ఇదే కరోనా విరుగుడు అంటూ.. హైదరాబాద్‌లో కొత్త దందా...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మూలాలు కనిపెట్టేందుకు,దాని వ్యాక్సిన్ తయారీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సైంటిస్టులు శ్రమిస్తున్నారు. సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం వ్యాక్సిన్ తయారీకి ఎంతలేదన్నా ఏడాది సమయం పట్టవచ్చు. ప్రఖ్యాత సైంటిస్టులే ఈ మాటలు చెబుతున్నవేళ.. కొంతమంది బురిడీ గాళ్లు మాత్రం తాము కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేశామంటూ జనాలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా పట్ల జనాల్లో ఉన్న ఆందోళనను క్యాష్ చేసుకునేందుకు నయా దందాకు తెరలేపిన ఓ గ్యాంగ్ మోసాలను హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు.

ఏం జరిగింది..

ఏం జరిగింది..

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతీ ఏటా మృగశిర కార్తే సమయంలో బత్తిని సోదరులు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందు పంపిణీ చేసే విషయం తెలిసిందే. దీని శాస్త్రీయత ఎలా ఉన్నా... ప్రతీ ఏటా దాదాపు 1లక్ష మంది చేపమందు కోసం వస్తారు. జనాల్లో బత్తిని సోదరులకు ఉన్న ఈ ఆదరణను క్యాష్ చేసుకునేందుకు ఓ గ్యాంగ్ రంగంలోకి దిగింది. కరోనా వేళ ప్రజల బలహీనతలను,బత్తిని సోదరుల ఆదరణను క్యాష్ చేసుకునేలా కొత్త దందా షురూ చేసింది. కోవిడ్-19కి బత్తిని సోదరులు మందు కనిపెట్టారంటూ ఇంటర్నెట్‌లో ప్రచారం చేసింది.

ఇలా వల వేశారు...

ఇలా వల వేశారు...

అంతేకాదు కోవిడ్ 19 మందును ఆన్ లైన్‌లోనే విక్రయిస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చింది. ఈ విషయాన్ని బత్తిని హరినాథ్ గౌడ్ గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ఆ గ్యాంగ్ పంచిన కొన్ని కరపత్రాలను,ఇంటర్నెట్ ప్రకటనలను గుర్తించారు. అందులో ఉన్న నంబర్ల ఆధారంగా వారిని సంప్రదించి... తమకూ కోవిడ్ 19 మందు కావాలంటూ కోరారు. గూగుల్ పే ద్వారా డబ్బు కూడా చెల్లించారు.

నేచర్ కోవిడ్ అభయ.. గ్యాంగ్ అరెస్ట్

నేచర్ కోవిడ్ అభయ.. గ్యాంగ్ అరెస్ట్

ఫోన్ చేసి పోలీసులని తెలియక.. ఆ గ్యాంగ్ మేరిగ మహేంద్ర అనే యువకుడితో నకిలీ మందును పంపించింది. 'నేచర్ కోవిడ్ అభయ' పేరుతో విక్రయిస్తున్న ఆ మందును కేవలం 6గ్రాములకు రూ.285 వసూలు చేస్తున్నారు.యువకుడు నకిలీ మందుతో తమవద్దకు రాగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. శామీర్‌పేటకు చెందిన బత్తిని రాజ్‌కుమార్(39),సుచిత్రకు చెందిన పంపన సుబ్బారావు,సైనిక్‌పురిలో నివాసం నిడమర్తి ఉండే ఉదయ్ భాస్కర్(50)లు గ్యాంగ్‌గా ఏర్పడి ఈ దందా మొదలుపెట్టినట్టు తెలిపాడు. రాజ్‌కుమార్‌కు బత్తిని ఇంటి పేరు ఉండటంతో దాన్నే వాడుకుంటున్నట్టు తెలిపాడు. యువకుడు ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు ఆ ముగ్గురితో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Recommended Video

New Infection In 3 To 11 Years Of Age Kids In AP

English summary
hyderabad police arrested a gang who selling fake coronavirus medicine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X