బాలికపై పెంపుడు తండ్రితో పాటు మరో ఇద్దరి లైంగికదాడి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన పెంపుడు తండ్రితో పాటు మరో ఇద్దరిని ముషీరాబాద్ పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఘటన హైద్రాబాద్ ముషీరాబాద్ లో చోటుచేసుకొంది.

ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్ కు చెందిన బాలిక తల్లితో కలిసి ఉంటోంది. నాలుగేళ్ళ క్రితం ఆమె తండ్రి ఆత్మహత్యకు పాల్పడడంతో బాలిక తల్లి బాపూజీనగర్ కు చెందిన క్యాటరింగ్ కార్మికుడు హరీష్ కృష్ణమూర్తిని పెళ్ళిచేసుకొంది.

Hyderabad police arrested three persons for sexual harassment

వీరు గతంలో వారాసిగూడ ప్రాంతంలో ఉన్న సమయంలోనే అదే ప్రాంతానికి చెందిన టెంట్ హౌజ్ కార్మికుడు సాయికిరణ్ తో బాలికకు పరిచయమేర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నట్టు నమ్మించిన సాయికిరణ్ పెళ్ళిచేసుకొంటానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అంతేకాదు తన స్నేహితుడు వారాసిగూడకు చెందిన ఆటోడ్రైవర్ నక్కరాజు కు ఆమెను పరిచయం చేశాడు. దీనికి సాకుగా తీసుకొన్న రాజు బాలికను తమ ఇంటికి తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెంపుడు తండ్రి కూడ ఆమెపై రెండుసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.

అయితే భయంతో బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. శనివారం నాడు ఆమె తన తల్లికి విషయం చెప్పింది. దీంతో బాధితురాలితో కలిసి ఆమె ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది.

కేసు నమోదుచేసుకొన్న పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్టుచేసి రిమాండ్ కు తరలించారు. బాధితురాలిని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భవతిగా తేలింది.

అయితే పెంపుడు తండ్రి, మరో ఇద్దరు యువకుల చేతిలో మోసపోయిన బాలికను వెంటనే ప్రభుత్వ బాలిక వసతి గృహనికి తరలించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. బాధితురాలని ఆదుకొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తల్లిని కూడ విచారించాలని ఆయన కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad police arrested three persons for sexual harassment . step father and other two persons sexually harassed on a girl. victim complaint against him.
Please Wait while comments are loading...