హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ ముఠా: ముంబై టూ హైదరాబాద్, పరారీలో ప్రధాన సూత్రధారి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాాబద్: మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ఓ ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ వెస్ట్‌జోన్ యాంటీ నార్కోటిక్‌ సెల్‌ (ఏఎనసీ) టీమ్‌ ఆరెస్టు చేసింది. నిందితులు అక్షయ్‌ కన్నోలి, శిశిర్‌చౌహాన, పి.రాహుల్‌ సన్నీ, కపీశ్‌ అగర్వాల్‌, రోహితరావు, మికేల్‌ను అరెస్టు చేశారు. కాగా, పోలీసులు ప్రధాన నిందితుడు పీటర్‌ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

నిందితుల నుంచి 48 గ్రాముల కొకైన, 207 ఎనఎస్‌డీ డ్రగ్‌ స్టాంప్స్‌, 10 గ్రాముల చరస్‌, 12 సెల్‌ఫోన్లను, ఒక పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ జాయింట్‌ కమిషనర్‌ టి.ప్రభాకరరావు వివరాలను వెల్లడించారు.

కేరళలోని వాన్వాడ్‌ జిల్లా అంబాలవయనకు చెందిన విద్యార్థి అక్షయ్‌ కన్నోలి సికింద్రాబాద్‌ వివేకానందపురంలోని సిల్వర్‌ లైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఎల్‌ఎస్‌డీ (లైసర్‌జిక్‌ యాసిడ్‌ డిత్లమైడ్‌) అనే డ్రగ్‌కు బానిసయ్యాడు. ఇతడు తరుచుగా గోవా వెళ్లి ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ స్టాంప్స్‌ను ఓ వ్యక్తి వద్ద కొనుగోలు చేసేవాడు.

ఘనాపాఠీ మికేల్..

ఘనాపాఠీ మికేల్..

ఘనాకు చెందిన మికేల్‌ సికింద్రాబాద్‌లోని మాధవపురిలో నివసించేవాడు. ఇతను కొకైన, ఎన్ఎస్‌డీ డ్రగ్‌ని హైదరాబాద్‌కు సరఫరా చేసేవాడు. మికేల్‌తో అక్షయ్‌ కన్నోలికి పరిచయం ఏర్పడింది. ఒక్కో ఎనఎస్‌డీ డ్రగ్‌ స్టాంప్‌/బ్లాట్‌ని మికేల్‌ నుంచి రూ.600 నుంచి 700లకు కొనుగోలు చేసి కస్టమర్లకు, విద్యా ర్థులకు 1600 నుంచి 1700 వందలకు అమ్ముతున్నాడు.

ఇలా దించాడు..

ఇలా దించాడు..

ఆర్కేపురం శుభోదయ అపార్ట్‌మెంట్‌లో నివసించే విద్యార్థి శిశిర్‌ చౌహానను కన్నోలి డ్రగ్‌ వ్యాపారంలోకి దించి అవసరమైన డ్రగ్‌ స్టాంప్‌లను సరఫరా చేసేవాడు. రాహుల్‌, కపీశ్‌ అగర్వాల్‌, రోహితరావు అనే విద్యార్థులు శిశిర్‌ ద్వారా అక్షయ్‌ కన్నోలికి పరిచయం అయ్యారు. ఈ ముగ్గురూ శిశిర్‌ చౌహాన నుంచి డ్రగ్‌ స్టాంప్‌ ఒక్కోటి రూ. 1200లకు కొనుగోలు చేసి 1500 నుంచి 1700లకు అమ్మేవారు.

ఈ ప్రాంతాల్లో..

ఈ ప్రాంతాల్లో..

హైదరాబాదులోని సోమాజిగూడలోని పార్క్‌ హయత్, శామీర్‌పేటలోని లియోనియా, గచ్చిబౌలిలోని ఎన డేంజర్స్‌, జూబ్లీహిల్స్‌లోని ది ఫామ్‌ హంటర్‌ హోటళ్లకు వచ్చే కస్టమర్లకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు నిందితులు తెలిపారు. అయితే ఈ విషయాన్ని నిర్ధారించు కోవాల్సి ఉందని జాయింట్‌ కమిషనర్‌ ప్రభాకరరావు తెలిపారు.

మికేల్‌ నుంచి 48 గ్రాముల కొకైన స్వాధీనం

మికేల్‌ నుంచి 48 గ్రాముల కొకైన స్వాధీనం

ఘనాకు చెందిన మికేల్‌ సికింద్రాబాద్‌ సైనిక్‌పురిలోని మాధవపురిలో నివసిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. మికేల్‌ ఘనాలో వస్త్ర వ్యాపారం చేసేవాడు. 2012లో బిజినెస్‌ వీసాపై భారతకు వచ్చాడు. ముంబై, హైదరాబాద్‌ నుంచి దుస్తులను కొనుగోలు చేసి తమ దేశానికి ఎగుమతి చేసేవాడు.

ముంబై నుంచి ఇలా..

ముంబై నుంచి ఇలా..

ముంబైలో డ్రగ్స్‌ అమ్మే పీటర్‌తో మికేల్‌రు పరిచయం ఏర్పడడంతో ఈ డ్రగ్‌ నెట్‌వర్క్‌లో చేరాడు. ఇతను పీటర్‌ నుంచి గ్రాము కొకైన రూ.3 వేలకు కొని హైదరాబాద్‌లో 5 వేల నుంచి 6 వేలకు అమ్మేవాడు. తమ వ్యాపారానికి మెట్రోపాలిటిన నగరాలనే ఎంచుకుని కస్టమర్లను పరిచయం పెంచుకుని కళాశాలలు, పబ్‌లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. సికింద్రాబాద్‌ క్లబ్‌ వద్ద మికేల్‌ అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని 48 గ్రాముల కొకైనని స్వాధీనం చేసుకున్నారు.

ఇలా బుక్కింగ్..

ఇలా బుక్కింగ్..

డ్రగ్స్‌ అమ్మే వీరు కస్టమర్లకు ప్రత్యేక కోడ్‌లు ఇచ్చేవారు. ‘బుక్‌', ‘చార్లీ' పేర్లతో కోడ్‌లు ఉండేవి. ఫోన ద్వారా ఈ కోడ్‌ని చెబితేనే తమ కస్టమర్లుగా నిర్ధారించుకుని సరుకు సరఫరా చేసేవారు. ఈ విధానం ఒక చైన్‌లాగా సాగేది. మొదట కన్నోలి 2014లో గోవాకు వెళ్లి డ్రగ్‌ వ్యాపారంలోకి ప్రవేశించాడు. 2015 కొత్త సంవత్సర వేడుకలకు గోవాకు చౌహానను తీసుకువెళ్లి ఈ వ్యాపారంలోకి దించాడు.

English summary
Hyderabad police on Friday busted two drug rackets by arresting a Ghana national and another five-member students’ gang led by an 18-year-old Intermediate student.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X