హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వ్యభిచార దందా గుట్టు రట్టు.. సెక్స్ వర్కర్లు,విటులు అరెస్ట్...
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలు చేశారు. స్థానిక రోడ్ నం.41లోని ఓ హోటల్ ఓయో రూమ్‌పై దాడులు చేసి ముగ్గురు సెక్స్ వర్కర్లు,ఇద్దరు విటులు,ఒక నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. గురువారం(మే 20) అందిన సమాచారంతో పోలీసులు పక్కా ప్లాన్‌తో అదే రాత్రి ఓయో రూమ్‌పై దాడి చేశారు.
వ్యభిచార గృహ నిర్వాహకుడిని అశ్విన్‌గా గుర్తించారు. విటులను అల్వాల్‌కి చెందిన వ్యాపారి రాహుల్ సురాన(32),కూకట్‌పల్లి నిజాంపేటకు చెందిన వెంకట అప్పయ్య(44)లుగా గుర్తించారు. సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్న యువతులను గుజరాత్‌లోని వడోదర,మహారాష్ట్రలకు చెందినవారిగా గుర్తించారు. సెక్స్ వర్కర్లను ప్రభుత్వ షెల్టర్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గత నెలలో షేక్‌పేట్ ఓయూ కాలనీలోనూ ఓ వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఓ గెస్ట్ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార దందాను పోలీసులు బయటపెట్టారు. రాత్రి సమయంలో గెస్ట్ హౌస్‌పై దాడి చేసి వ్యభిచారం చేస్తున్న ఇద్దరు యువతులు,ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. గెస్ట్ హౌస్ వాచ్‌మెన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మున్నాభాయ్ అనే వ్యక్తి ఈ దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు.
షేక్‌పేట్ ఘటనకు రెండు రోజుల ముందు మాదాపూర్‌లోనూ ఓ వ్యభిచార దందా బయటపడింది. స్థానికంగా ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ హోటల్‌పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు,ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు,ఒక విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటలో గదిలో రూ.29,560 నగదు, కండోమ్ ప్యాకెట్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications