Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"చైనీస్ మాంజా అమ్మినా, వాడినా.. చట్టం ఊరుకోదు.. లోపలేస్తది"

సంక్రాంతి పండక్కు గాలి పటాలు ఎగురవేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే కొందరు గాలిపటాలను ఎగురవేసేందుకు చైనీస్ మాంజాను వినియోగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2016లోనే రాష్ట్రంలో చైనీస్ మాంజాను నిషేధించింది. కానీ చాలా మంది వ్యాపారస్థులు అక్రమంగా వీటి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. చైనీస్ మాంజాను నైలాన్, సింథటిక్ దారంతో తయారు చేస్తారు. చైనీస్ మాంజాతో పక్షులు, మనుషులు ప్రమాదంలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనీస్ మాంజాపై పోలీసుల దాడులు నిర్వహిస్తున్నారు.

చైనీస్ మాంజా వినియోగంపై హైదరాబాద్ సిటీ పోలీసుల దాడులు నిర్వహిస్తున్నారు. చైనీస్ మాంజాపై తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారులు ఆన్‌లైన్ బాట పట్టినట్లు మా దృష్టికి వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ-కామర్స్‌ వెబ్‌ సైట్లు, సోషల్ మీడియా వేదికగా సాగే విక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.ఆన్‌ లైన్‌ లో నిషేధిత మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సూచనలు చేశారు. "చైనీస్ మాంజా అమ్మినా, వాడినా.. చట్టం ఊరుకోదు.. లోపలేస్తది" అని అన్నారు..

"సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలను అరికట్టేందుకు విస్తృత చర్యలు చేపట్టాం. నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పెద్ద ఎత్తున చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నాం. నగర వ్యాప్తంగా అన్ని జోన్లలో నిర్వహించిన దాడులలో ఇప్పటివరకు మొత్తం 103 కేసులు నమోదు కాగా, 143 మంది నిందితులను అరెస్టు చేయడం జరిగింది. వీరి నుంచి రూ. 1.24 కోట్ల విలువైన 6,226 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నాం" అని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

Hyderabad Police Crackdown 1 24 Crore Chinese Manja Seized 143 Arrested Ahead of Sankranti

అలాగే ప్రజలు తమ ప్రాంతాల్లో ఎక్కడైనా చైనీస్ మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డైల్ 100 కు లేదా పోలీస్ వాట్సప్ నంబర్ 9490616555 కు సమాచారం అందించాలని పోలీసులు సూచనలు చేశారు. ప్రాణనష్టాన్ని నివారించడంలో భాగస్వాములు కావాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+