హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘ఆపరేషన్ లేట్‌నైట్ రోమియోస్’: 110మంది అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ, మహిళలను వేధింపులకు గురి చేసే పోకిరీల భరతం పట్టేందుకు నగర పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ లేట్‌నైట్ రోమియో' మంగళవారం రాత్రి కూడా కొనసాగింది.

నగరంలోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో అర్ధరాత్రి పనీపాటా లేకుండా తిరిగే 110మంది యువకులను సౌత్ జోన్ డిసిపి సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఫలక్‌నుమా నబీల్ ఫంక్షన్ హాల్‌కు తరలించారు.

Hyderabad Police’s New Venture ‘Operation Late Night Roam-Yos’ Targets ‘Nuisance’ Creating Youth

బుధవారం ఉదయం వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేయనున్నారు. తమ పిల్లలను అదుపులో పెట్టుకోవాలని, మరోసారి అర్ధరాత్రి రోడ్లపై కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

గత సోమవారం అర్ధ రాత్రి కూడా దాదాపు 300మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇటీవల పాతబస్తీలో జరిగిన స్ట్రీట్ ఫైట్‌లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

English summary
As many as 110 youths were rounded up by police in Hyderabad's Old City as part of 'Operation Late Night Roam-Yos' which is aimed at restraining youngsters and minors from roaming the streets in the area and creating nuisance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X