హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ హామీ సరే: తీరని హైదరాబాద్ నగర వాసుల తాగునీటి ఎద్దడి

ఈ ఏడాది చివర్లో నీటి సరఫరా సంగతి మాట పక్కనబెడితే ప్రస్తుతం వేసవిలో సరిపడా తాగు నీరు లభించక హైదరాబాద్ నగర వాసులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: '2017 డిసెంబర్ నెలాఖరు నాటికి హైదరాబాద్ నలుమూలల ప్రతిరోజూ తాగునీరు పంపిణీ చేస్తాం'అని ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది చివర్లో నీటి సరఫరా సంగతి మాట పక్కనబెడితే ప్రస్తుతం వేసవిలో సరిపడా తాగు నీరు లభించక హైదరాబాద్ నగర వాసులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. వివిధ బస్తీలు, కాలనీల్లో తాగునీటి కోసం ప్రజలు నీటి నల్లాల వద్ద బారులు తీరుతున్నారు.

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు తనయుడైన రాష్ట్ర మంత్రి తారక రామారావు హామీ సంగతేమిటో గానీ ప్రస్తుతం రాష్ట్ర రాజధాని భాగ్య నగరంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. మంత్రి కేటీఆర్ హామీ సంగతేమిటో గానీ రోజువారీ నీటి సరఫరా సంగతి మర్చిపోవాల్సిందేనని పుప్పాల గూడ వాసులు చెప్తున్నారు. రోజు విడిచి రోజు పంపిణీ చేస్తే గొప్పేనంటున్నారు.

సగటుకంటే తక్కువకు పడిపోయిన సాగర్ నిల్వలు

ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా చేసే ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయిలో అట్టడుగు స్థాయికి పడిపోయాయి. నాగార్జున సాగర్‌ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా, గత నెల 22వ తేదీన ఆందోళనకరస్థాయిలో 506 అడుగులకు పడిపోయాయి. కనీస నిల్వ స్థాయి 510 అడుగులకు దిగువన నీటి నిల్వలు ఉన్నా, అధికారులు మాత్రం భారీ ప్రెషర్ గల పంపింగ్ మోటార్లతో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తోడేస్తున్నారు.

Hyderabad reels under acute water shortage as rain plays truant

అడుగంటిపోయిన హైదరాబాద్ ప్రధాన రిజర్వాయర్లు

హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని తీర్చేందుకు క్రుష్ణా, గోదావరి, మంజీరా నదుల నుంచి నీటి సరఫరాతోపాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు అడుగంటి పోయాయి. ఈ రిజర్వాయర్ల నుంచి హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల్లో 60 - 70% తీరిపోతాయని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారి ఒకరు తెలిపారు. నగరం చుట్టుపక్కలా మరో 12 నూతన తాగునీటి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయినా మంచి వర్షాలు కురవక పోతే రోజూ తాగునీటి సరఫరాచేయాలన్న ప్రభుత్వ కల కల్లలుగానే మిగిలిపోతుందని ఆ అధికారి తెలిపారు.

పడిపోయిన భూగర్భ జల నిల్వలు

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నల్లా నీటి కోసం పంప్ వద్ద బారులు తీరితే రెండు, మూడు కుండల నీళ్లు దొరికితే చాలని చెప్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొంది. భూగర్భ జలాలు ఆందోళన కర స్థాయిలో 2.46 మీటర్లకు దిగువకు పడిపోయాయి.

హైదరాబాద్ నగరానికి పక్కనే ఉన్న జిల్లా కేంద్రం సంగారెడ్డి పరిధిలో 5.84 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. ఈశాన్య రుతు పవనాల తర్వాత సరిగ్గా వర్షాలు కురవక తెలంగాణలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఖరీఫ్ సీజన్‌ చివరిలో కురిసిన వర్షాలతో రబీ సీజన్‌లో దిగుబడులు బాగా వస్తాయన్న తమ కలలు కల్లలుగానే మిగిలిపోయాయని యాదాద్రి - భువనగిరి జిల్లా వాసి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తాగునీటితో తెలంగాణ సతమతం
దురద్రుష్టవశాత్తు తెలంగాణ యావత్ తాగునీటి కొరతతో సతమతం అవుతున్నది. గత ఏడాది నైరుతి రుతుపవనాల్లో సగటు కంటే ఎక్కువ వర్షాలు కురిసినా తాగునీటి కొరత వెంటాడుతూనే ఉన్నది. సాధారణంగా సగటున 713.5 మిల్లీమీటర్ల వర్షఫాతానికి బదులు 912 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనా వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో సమస్యలు తలెత్తుతున్నాయి.

గత ఏడాది వర్షాలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒకేసారి, ఒకే తరహాలో కురవలేదు. నైరుతి రుతుపవనాల చివరి దశలో వర్షాలు కురవడం కూడా అద్వాన్న పరిస్థితులకు దారి తీసిందని అంటున్నారు. 2016 ఆగస్టు నాటికి ఆరు శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. ఖరీఫ్ సీజన్‌ చివరి దశలో వర్షాలు కురవడంతో రబీ సీజన్‌లో పంటల సాగుకు వెసులుబాటు లభిస్తుంది. రబీ సీజన్‌లో పొడి వాతావరణం వల్ల పలు ప్రాంతాల్లో రబీ పంటలు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో అద్వాన్న పరిస్థితులు

తెలంగాణ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 10 జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం కురవడంతో పరిస్థితి మరింత అద్వాన్నంగా మారింది. విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు జిల్లాలు మినహా శ్రీకాకుళం, ప్రకాశంలతోపాటు రాయలసీమ జిల్లాల్లో 20 శాతం, నెల్లూరు జిల్లాలో 60 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 670 మండలాలకు 370 మండలాలు కరువు భారీన పడ్డాయి. వర్షకాలంలో సరిపడా వర్షాలకు కురవక పోగా, పట్టణ ప్రాంతాల్లో ఆశాకాన్నంటేలా నిర్మించిన అపార్ట్‌మెంట్లతో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.

English summary
An acute water shortage has left Hyderabad parched with residents being forced to stand in long queues to collect water. 'By the end of 2017, our government will ensure supply of drinking water to every nook and corner of Hyderabad every day,' declared Telangana minister for municipal administration KT Rama Rao at a government function recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X