హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 6 వారాల పాటు ఆ ఫ్లైఓవర్ బంద్
హైదరాబాద్ సిటీ దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటిగా ఉంది. ప్రపంచంలోని మహా నగరాల్లో ప్రస్తుతం భాగ్యనగరం 41వ స్థానంలో ఉంది. మెట్రో పాలిటన్ సిటీగా అభివృద్ధి చెందింది. మరోవైపు భాగ్యనగరంలో జనాభా రోజు రోజుకూ పెరిగిపోతోంది. 2025లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటీ 13 లక్షల 30 వేలుగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో అంటే 2024తో పోలిస్తే 2.43 శాతం పెరుగుదల కనిపించింది. అంటే హైదరాబాద్ జానాభా ఏటా దాదాపు 3 శాతం పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.
అయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ పలు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కు మరమ్మతులు చేయనుంది జీహెచ్ఎంసీ సిబ్బంది. దీంతో వచ్చే ఆరు వారాల పాటు ఈ ఫ్లై ఓవర్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మాసబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ ను నెలన్నర పాటు ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మూసివేయనున్నట్లు ఈ మేరకు అధికారులు స్పష్టం చేశారు. ఫ్లై ఓవర్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు.

2001లో మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. గత 25 ఏళ్లుగా ఇది వాడుకలో ఉంటూ వస్తోంది. ఫ్లైఓవర్ కొన్ని చోట్ల దెబ్బ తిని వర్షాలు కురిసిన సమయంలో ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో అధికారులు నీటి లీకేజీని నివారించడానికి.. అలాగే అరిగిపోయిన స్ట్రిప్ సీల్ జాయింట్ లకు సైతం జీహెచ్ ఎంసీ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. మహావీర్ హాస్పిటల్ నుంచి ఎన్ ఎండీసీ వైపు వెళ్లే వాళ్లు ఫ్లైఓవర్ కు బదులుగా సర్వీస్ రోడ్డును ఉపయోగించాలని అధికారులు సూచించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications