హైదరాబాద్‌లోనూ..: కదులుతున్న కార్లో నోట్లో గుడ్డలు కుక్కి సేల్స్‌ గర్ల్‌పై రేప్

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కూడా ఢిల్లీలో మాదిరిగా అత్యాచార ఘటన జరిగింది. ఉద్యోగం చేసి ఇంటికి వెళ్తున్న ఓ సేల్స్ గర్ల్‌ కదులుతున్న కారులో అత్యాచారానికి గురైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ శివారులో ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది.

పెద్ద అంబర్‌పేట శాంతినగర్‌కు చెందిన యువతి ఎల్‌బీనగర్‌ చింతల్‌కుంటలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. ఆదివారం రాత్రి 9.30 గంటలకు బాధితురాలు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తోంది. పెద్ద అంబర్‌పేట్‌ వద్ద బస్సు దిగి, శాంతినగర్‌కు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఏపీ 29 టీవీ 6595 కారులో వచ్చి బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు.

అరవకుండాచేతి టవల్‌ను నోట్లో కుక్కారు. బలిజగూడ వైపు వెళ్తూ కారులోనే ఆమెపై ఒక యువకుడు అత్యాచారం చేశాడు. బాధితురాలిని కారులోకి లాగుతుండగా శాంతినగర్‌కు చెందిన ఒక వ్యక్తి ఆమెను తమ ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించాడు. స్థానికులను అప్రమత్తం చేశాడు. కొంతమంది యువకులు బలిజగూడ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లగా ఒకచోట ఆ కారు ఆగి కనిపించింది. స్థానికులు గుమిగూడటంతో దుండగులు కారు అక్కడే వదిలి పారిపోయారు.

Hyderabad: Sales girl raped in moving car

బాధితురాలు స్థానికులకు అసలు విషయం చెప్పింది. వారు హయతనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఆ యువతిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ముగ్గురు నిందితులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. యువతికి తెలిసిన వ్యక్తులే ఈ పని చేశారని పోలీసులు చెబుతున్నారు. ముగ్గురిలో ఒక్కడే అత్యాచారం చేశాడని పోలీసులు నిర్దారించారు. వారిని మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+