ఉదయం సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. సాయంత్రం బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ విక్రయం..
హైదరాబాద్ మహానగరాన్ని మత్తు కబలించేస్తోంది. చలికాలంలో డ్రగ్స్ విక్రయాలు పెరిగినట్లు స్పష్టం అవుతోంది. నవంబరు నుంచి జనవరి మధ్యే విక్రయాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికారులు డ్రగ్ పెడ్లర్స్ పై కఠినమైన చర్యలు తీసుకున్నా మరో విధంగా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తాజా లెక్కల ప్రకారం ఒక్క హైదరాబాద్ లోనే 10 వేల మందికి పైగా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు అంచనా. ఈ మత్తు సరఫరా, విక్రయంలో ఇప్పటి వరకూ నైజీరియన్ గ్యాంగ్, అంతర్రాష్ట్ర ముఠాలు ఉండేవి. అయితే రానురాను ఉన్నత ఉద్యోగాలు చేసే వాళ్లు కూడా డ్రగ్స్ ను విక్రయించడం ఆందోళన కలిగించే అంశం.
బీటెక్ చదివి.. సాప్ట్ వేర్ ఇంజినీర్ గా ప్రముఖ హోదాలో ఉన్న ఓ లేడీ సాప్ట్ వేర్ ఇంజినీర్ డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు చిక్కడం ఇప్పుడు హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ ను విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఉన్నత ఉద్యోగాల కోసం ఏపీలోని కాకినాడ నుంచి వచ్చి సిటీలో ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ అమ్మకాలు చేశారు వీళ్లు. ఈ మేరకు నలుగురిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ మాఫియా ఏ రేంజ్ లో విస్తరిస్తుందో ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. డ్రగ్స్ సరఫరాలో నైజీరియన్ గ్యాంగ్స్ దే ఇప్పటివరకూ హవా ఉంది. డ్రగ్స్ ను రకరకాల పద్దతుల్లో విక్రయం జరుగుతోంది. ఫోన్ టాక్, వాట్సాప్ ఛాటింగ్ గుర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటీవలికాలంలో టెలీగ్రామ్ యాప్ ద్వారా మంతనాలు సాగిస్తున్నారు. మరో ఆందోళనకర అంశం ఏంటంటే ఉన్నత చదువులు చదివి సాప్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా డ్రగ్స్ ను విక్రయించడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఏపీలోని కాకినాడకు చెందిన సుస్మిత అనే యువతి బీటెక్ చేసి హైదరాబాద్ మంచి సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆమె విధులు నిర్వర్తిస్తోంది. అయితే తన బాయ్ ఫ్రెండ్ ఇమ్మాన్యుయెల్ తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తూ తాజాగా చిక్కడపల్లి పోలీసులకు ఈ ప్రేమజంట దొరికింది. ఈ కేసులో వీరితో పాటు మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఎండిఎంఏ, LSD బాటిల్స్, ఓజీ కుష్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 లక్షల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.
-
మూసీ తీరాన మహత్తరం -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!











Click it and Unblock the Notifications