వరంగల్ ఎన్ఐటీలో హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో విషాద ఘటన చోటు చేసుకుంది. నెట్ హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరానికి చెందిన విద్యార్థి హృతిక్ సాయి వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు.
మార్కులు తక్కువగా వస్తున్నాయనే మనస్తాపంతో వడ్డేపల్ల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాలేజీ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బీటెక్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆములూరులో చిన్నరాములు అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పొలంలో గొర్రెలు కాస్తుండగా పిడుగుపడి రాములు మృతి చెందాడు. ఇది ఇలావుండగా, బీహార్ రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో పిడుగుపాటుకు 25 మంది మృతి చెందడం గమనార్హం. ఒక్క నలంద జిల్లాలోనే 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. బుధవారం కూడా పిడుగుపడి పది మందికిపైగా మృతి చెందారు.












Click it and Unblock the Notifications