అమెరికాలో కాల్పులు .. హైదరాబాద్ విద్యార్థి మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. డల్లాస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. డల్లాస్ లోని ఓ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న విద్యార్థిపై దుండగుడు కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. విద్యార్థి పార్థీవదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేలా తక్షణమే చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమెరికాలోని డల్లాస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన పోలే చంద్రశేఖర్ అనే విద్యార్థి మృతి చెందాడు. పోలే చంద్రశేఖర్ 2023లో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. అయితే అక్టోబర్ 4 ఉదయం డల్లాస్ లో ఓ దుండగుడు పెట్రోల్ పోసుకునేందుకు వచ్చి చంద్రశేఖర్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే తాజాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఎల్బీ నగర్ కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించింది.
— Revanth Reddy (@revanth_anumula) October 4, 2025
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం…
"అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఎల్బీనగర్ కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం" అని స్పష్టం చేశారు.

ఇదే ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు వనస్థలిపురంలోని టీచర్స్ కాలనీలో ఉన్న చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖర్ పార్థీవదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేలా తక్షణమే చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications