పెళ్లై, పిల్లులున్నా! మరో యువతితో టెక్కీ సహజీవనం: అరెస్ట్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పెళ్లి పేరుతో ఓ యువతితో సహజీవనం చేసి మోసం చేసిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మల్కాజిగిరి వాసి అయిన యుగంధర్(35) గత కొంత కాలంగా చెన్నైలోని సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు.

కాగా, పర్వపూర్ ఇంద్రప్రస్థానంలో నివసించే ఓ యువతితో యుగంధర్‌కు ఫోన్లో పరిచేయడం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెతో చనువు పెంచుకున్న యుగంధర్.. పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంత కాలం నుంచి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.

hyderabad techie remanded for cheating woman

ఈ నేపథ్యంలో తనను వివాహం చేసుకోవాలని ఆ యువతి.. యుగంధర్‌పై ఒత్తిడి పెంచింది. దీంతో తనకు వివాహం ఇప్పటికే అయిందని, మళ్లీ నిన్ను పెళ్లి చేసుకోలేనని ఆ యువతితో తేల్చి చెప్పాడు యుగంధర్.

తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను మానసికంగా, శరీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, వివాహం చేసుకుంటానని శరీరకంగా వాడుకున్నాడని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad techie remanded for cheating woman.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X