జూన్ 30 నుంచి హైదరాబాద్ బోనాలు ప్రారంభం: మొదటగా గొల్కోండలో

హైదరాబాద్: మహానగరం ఆషాడ బోనాల ఉత్సవాలకు సిద్ధమవుతోంది. నగరమంతా సుమారు నెలరోజులపాటు ఆధ్మాత్మిక శోభను సంతరించుకునే ఆషాడ బోనాల ఉత్సవాలు జూన్ 30న గోల్కొండ బోనాలతో ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జూలై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు సమర్పిస్తారు.

మరుసటి రోజు జూలై 18న రంగం కార్యక్రమంలో భవిష్యవాణి ఉంటుంది.జూలై 24వ తేదీన భాగ్యనగర బోనాలు, జూలై 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు నిర్వహిస్తారు. జూలై 28వ తేదీన గోల్గొండ బోనాలతో ఉత్సవాలు ముగుస్తాయి. బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని తెలిపారు.

Hyderabad: telangana bonalu starts from June 30th

హైదరాబాద్ నగరంలో చిన్నా పెద్దా తేడా లేకుండా 3 వేల దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించామన్నారు. కల్చరల్‌, లైటింగ్, ఎల్సీడీ స్క్రీన్‌తో బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయనున్నామని మంత్రి తలసాని తెలిపారు. బోనాల జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

జూన్​ 30న గోల్కొండ బోనాలతో ఆషాడ బోనాలు, జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, జులై 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమం, జులై 24న భాగ్యనగర బోనాలు, జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాలు ఊరేగింపు, జులై 28న గోల్కొండ బోనాలతో ముగియనున్న ఉత్సవాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+