ట్విస్ట్.. రోహిత్‌ను సూసైడ్‌కు పురిగొల్పారా..!?: ఏబీవీపీ డౌట్, కేజ్రీ వార్నింగ్(పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య విషయమై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రులు కారణమని ఏఎస్ఏ, కాదు... ప్రొఫెసర్లు, ఏఎస్ఏ ఒత్తిడి కారణమని ఏబీవీపీ ఆరోపిస్తోంది.
రోహిత్ ఆత్మహత్య పైన దేశవ్యాప్త చర్చ సాగుతోంది. అయితే, దీనిపై తాజాగా షాకింగ్ విషయాలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. ఏఎస్ఏ సహా క్యాంపస్‌లోని విద్యార్థి సంఘాల కార్యకలాపాలు రోహిత్‌ను ఆత్మహత్యకు పురికొల్పాయా? అనే చర్చ కూడా సాగుతోంది.
రోహిత్ ఆత్మహత్యలో కొత్త మలుపు చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. కుల వివక్ష, వర్సిటీ అధికారుల వేధింపుల కారణంగా రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని నిన్నటిదాకా వినిపించిన ఆరోపణలు కాస్తంత తగ్గాయి. రోహిత్ అసలు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తే కాదన్న వాదన బయటకు రావడంతో ఆందోళన తీవ్రత తగ్గింది.
అయితే చనిపోవడానికి ముందు రోహిత్ రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ ప్రస్తుతం ఈ వ్యవహారంపై కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఆత్మహత్య చేసుకునే ముందు రోహిత్ తీవ్ర మానసిక వేదనతో ఓ లేఖ రాశాడు. 'నా జన్మే ఓ పెద్ద ప్రమాదం' అంటూ మొదలుపెట్టిన అతడు గూఢార్థాలతో కూడిన సుదీర్ఘ లేఖను రాశాడు.
సదరు లేఖలో ఏ ఒక్కరిని కూడా అతడు నిందించలేదు. తన ఆత్మహత్యకు తానొక్కడిని మాత్రమే కారణమని కూడా రోహిత్ పేర్కొన్నాడు. అయితే ఆ లేఖలో ఓ పేరాగ్రాఫ్ మేర రాసిన విషయాలన్నీ కొట్టేసి ఉన్నాయి. కొట్టేసిన అక్షరాలు ఏమాత్రం కనిపించకుండా నిండా ఇంకుతో రుద్దేసి ఉన్నాయి.
అంతేకాక సదరు కొట్టేసిన పేరాగ్రాఫ్ పక్కన టనేనే కొట్టేస్తున్నానుట అని పేర్కొన్న రోహిత్ అక్కడ సంతకం కూడా చేశాడు. దీనిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు లేఖను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అక్షరాలను కొట్టివేయదలిస్తే... ఓ అడ్డగీత గీస్తే సరిపోయేదానికి బదులుగా, అసలు సింగిల్ అక్షరం కూడా కనిపించకుండా కొట్టివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఫోరెన్సిక్ నివేదికపై అందరి చూపు ఉంది.

రోహిత్ ఆత్మహత్యపై ఏబీవీపీ సుశీల్ కుమార్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ఎబివిపి హెచ్‌సియు విభాగం డిమాండ్ చేసింది. అతని ఆత్మహత్యపై చాలా అనుమానాలున్నాయన్నారు. యూనివర్శిటీలోని ప్రొఫెసర్ల అసోసియేషన్‌కు చెందిన ప్రొఫెసర్ల కాల్‌డేటా పైనా సిబిఐతో విచారణ జరిపించాలన్నారు.

రోహిత్ ఆత్మహత్యపై ఏబీవీపీ సుశీల్ కుమార్
ఎబివిపి హెచ్‌సియు అధ్యక్షులు నందనం సుశీల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హెచ్‌సియులో జాతి వ్యతిరేక చర్యలు కొనసాగుతున్నాయని, అదేవిధంగా నక్సలిజం, కమ్యూనిజం భావజాలాన్ని బోధించడం తప్ప పాఠాలు బోధించే పరిస్థితి లేదని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు ఎబివిపికి ఎటువంటి సంబంధం లేదన్నారు. హెచ్‌సియులో దేశ ద్రోహులను సమర్ధించే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

రోహిత్ ఆత్మహత్యపై ఏబీవీపీ సుశీల్ కుమార్
ఆ క్రమంలోనే యాకుబ్ మెమెన్‌కు మద్దతుగా సంతాపసభలు నిర్వహించడంపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరం వ్యక్తం చేసినందుకు గాను కొందరు తనపై అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో దాడి చేశారని తెలిపారు. తాను చావుబ్రతుకుల మధ్య ఆసుపత్రిపాలయ్యానని అన్నారు. విసిని కలిసేందుకు తల్లితో కలిసి వస్తుంటే ఎఎస్‌ఏ కార్యకర్తలు బూతులు తిడుతూ, దాడి చేసే ప్రయత్నం చేశారని సుశీల్ కుమార్ వెల్లడించారు.

రోహిత్ ఆత్మహత్యపై ఏబీవీపీ సుశీల్ కుమార్
తొలిసారి విచారణ కమిటీ నివేదిక రాగానే ఆ ఐదుగురిపై సస్పెన్షన్ విధించారని, రెండోసారి కమిటీ విచారణకు హాజరై తన వంతు సమాచారం అందించానని సుశీల్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నారు తప్ప ఏకపక్షంగా కాదని స్పష్టం చేశారు. దీనిలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయల ప్రమేయం ఎంత మాత్రం లేదన్నారు. కేవలం హాస్టల్ వసతి మాత్రమే తగ్గించారు తప్ప అంతకు మినహా చర్యలు తీసుకోలేదన్నారు.

రోహిత్ ఆత్మహత్య
స్వేచ్ఛగా మాట్లాడటాన్నీ అడ్డుకోవాలని చూస్తే బిజెపికి ఢిల్లీ తరహా గుణపాఠం మళ్లీ తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని హెచ్చరించారు.

హైదరాబాదులో కేజ్రీవాల్
విద్యార్థులతో పెట్టుకుంటే కుర్చీ కోల్పోక తప్పదన్నారు.కేంద్రమంత్రి స్మృతిఇరానీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రయతిస్తున్న ఆమె జాతికి క్షమాపణ చెప్పాలని కేజ్రీవాల్ డిమాండు చేశారు.

హైదరాబాదులో కేజ్రీవాల్
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో జరుగుతున్న ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు. గురువారం ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన తొలుత విశ్వవిద్యాలయంలో ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులను పరామర్శించారు. అనంతరం సభలో మాట్లాడారు.

హైదరాబాదులో కేజ్రీవాల్
దేశ భవిష్యత్తు నిర్దేశించేది యువతేనని, విద్యాసంస్థల్లో యువత వాక్ స్వాతంత్య్రాన్ని నియంత్రించే ప్రయత్నం జరుగుతోందని కేజ్రీవాల్ ఆందోళన వెలిబుచ్చారు. రోహిత్ ఆత్మహత్యే అందుకు నిదర్శమన్నారు. నిమ్నవర్గాలను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

హైదరాబాదులో కేజ్రీవాల్
ఢిల్లీలోనూ తమనిలాగే నియంత్రించేందుకు బిజెపి ప్రయత్నించి, ఎన్నికల్లో భంగపడిన విషయం తెలిసిందేనన్నారు. రోహిత్ వ్యవహారంలో ఆద్యంతం కేంద్ర మానవనరులశాఖ, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు లోపభూయిష్టంగా ఉందన్నారు. నచ్చినట్లు ఆలోచించి, నిర్ణయం సమష్టిగా తీసుకున్నప్పుడే దేశం ముందుకెళ్తుందని, తమ మాదిరిగానే ఆలోచించాలని, లేకపోతే అంతు చూస్తామన్నట్లుగా ప్రవర్తించడం తగదని ఏబీవీపీ నేతలకు హితవు పలికారు

హైదరాబాదులో కేజ్రీవాల్
ఉద్దేశపూర్వకంగానే రోహిత్ తదితరులపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోందన్నారు. అసలు విషయం తెలుసుకోకుండానే కేంద్రమంత్రి దత్తాత్రేయ హెచ్‌ఆర్డీకు లేఖరాయడం, విచారణ జరపకుండానే నిర్ణయం తీసుకోవడం అంతా ఏకపక్షంగా సాగిందన్నారు. దత్తాత్రేయ లేఖ అనంతర పరిణామాలు, హెచ్‌ఆర్డీ హెచ్‌సీయూల మధ్య సాగిన ఫోన్ సంభాషణలు తదితరాలపై విచారణ జరిపితే నిజానిజాలు వెల్లడవుతాయన్నారు. అభిప్రాయ వ్యక్తీకరణ జాతిద్రోహం, కులతత్వం కిందకి ఎలా వస్తుందని నిలదీశారు.

సీతారాం ఏచూరీ
వామపక్ష నేత సీతారాం ఏచూరీ గురువారం నాడు ఉప్పల్‌లోని వేముల రోహిత్ ఇంటికి వెళ్లి.. రోహిత్ తల్లి రాధికను పరామర్శిస్తున్న దృశ్యం.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications