విమానంలో సాంకేతిక లోపం: క్షేమంగా బయటపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రికి ఫిర్యాదు
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి గన్నవరంకు వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో కలకలం రేగింది. గాల్లోనే 20 నిమిషాల పాటు చక్కెర్లు కొట్టింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ తిరిగి విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా దింపాడు.
విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు ఇంటిలిజెన్స్ ఛీఫ్ వెంకటేశ్వర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన బోండా ఉమ, చింతమనేని, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలతో పాటు సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ అడ్వకేట్ జనరల్ సహా 109 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ విమానం టేకాప్ అయిన తర్వాత తక్కువ ఎత్తులో ప్రయాణించందని, ఈ సమయంలో గాలి లేదని, ఏసీలు కూడా పనిచేయలేదని పేర్కొన్నారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల తర్వాత విమానంలోని పైలెట్ సాంకేతిక లోపం తలెత్తిందని, పైలెట్ సీట్ బెల్టు పెట్టుకోవాలని సూచించారని అన్నారు.

సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కెక్లు కొట్టిన విమానం ఆ తర్వాత ఎమర్జెన్సీ ల్యాడింగ్ అయిందని తెలిపారు. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యేలు విమానయాన శాఖా మంత్రి అశోకగజపతి రాజుకు ఫిర్యాదు చేశారు. ఈ విమానం తరచూ సాంకేతికలోపంతో ఆగిపోతోందని వారు తెలిపారు.
ఎన్నోసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని ఎమ్మెల్యే బొండా ఉమ ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం విజయవాడలో సాంకేతిక లోపంతో ఇదే విమానం ఆగిందిన మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఈ ఘటనను తీవ్రంగా పరిశీలిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మరికాసేపట్లో మరో విమానం ఏర్పాటు చేస్తామని అశోక్‌గజపతిరాజు చెప్పారు. గాల్లో చక్కెర్లు కొట్టిన 20 నిమిషాల పాటు విమానంలోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఆందోళకు గురయ్యారని పేర్కొన్నారు.
మరో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 3.50 గంటలకు బయలుదేరాల్సిన విమానం 4.15 గంటలకు బయలుదేరిందని అన్నారు. నిన్న కూడా ఈ విమానం రెండు గంటలు ఆలస్యంగా వెళ్లిందని, ఈరోజు కూడా ఆలస్యంగానే విజయవాడకు బయల్దేరిందన్నారు.
16 సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న పాత విమానాలనే వాడుతున్నారని మండిపడ్డారు. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని అన్న ఆయన, ప్రయాణీకుల్లో భయాన్ని పొగొట్టాల్సిన ఎయిర్ ఇండియా ప్రయాణికులు ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. ఏదో మేం క్షేమంగా దిగాం కాబట్టి మీతో ఫోన్లో మాట్లాడగలుగుతున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications