ఎడతెరిపిలేని వర్షం.. ఎటు చూసినా ట్రాఫిక్ జామ్

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలో జనజీవనం స్తంభించింది.

హైదరాబాద్: భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలో జనజీవనం స్తంభించింది.

భారీ వర్షాలకు ఇదీ భాగ్యనగరం పరిస్థితి (ఫొటోలు)

నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. నగరంలోని కూకట్ పల్లి, మియాపూర్ మార్గంలో మంగళవారం ఉదయం నుంచే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Hyderabad: Woes heavy rain, Full Tranfic Jam

రహదారిపై పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈసీఐఎల్, కాచిగూడ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.

కాచిగూడ బిగ్ బజార్, మాసబ్ ట్యాంక్, కట్టమైసమ్మ ఆలయం, నాంపల్లి కంట్రోల్ రూమ్, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, టోలిచౌకి సూర్యనగర్ కాలనీ, తాజ్ ఐలాండ్ జంక్షన్, బేగంపేట్, లైఫ్ స్టయిల్, గ్రీన్ ల్యాండ్స్, పంజాగుట్ట చౌరస్తా, వైఎంసీఏ, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కార్యాలయాలకు వెళ్లే సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+