ప్రేయసి కోసం వెళ్లిన హైదరాబాదీ పశ్చిమ గోదావరిలో మిస్
హైదరాబాద్: ప్రేమించిన యువతి కోసం వెళ్లిన హైదరాబాద్ వాసి వినయ్ అదృశ్యం సంచలనం సృష్టిస్తోంది. సికింద్రాబాదులోని అల్వాల్‌కు చెందిన వినయ్ తాను ప్రేమించిన యువతి మరియమ్మను పెళ్లి చేసుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడు ప్రాంతానికి వెళ్లాడు.
అయితే యువతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోగా వినయ్‌పై దాడికి యత్నించారు. దీంతో మరియమ్మ, వినయ్ అక్కడి నుంచి పారిపోయే క్రమంలో ఓ పెద్దకాల్వలో పడిపోయారు. వెంటనే మరియమ్మను కుటుంబసభ్యలు రక్షించారు. అనంతరం వినయ్ కాల్వలో కొట్టుకుపోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే వినయ్‌ను మరియమ్మ కుటుంబసభ్యులే కొట్టి చంపి కాల్వలో పడేశారని అతడి తల్లిదండ్రులు అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వినయ్ కోసం గత రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు మరియమ్మ కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం రెంజర్లలో తాళం వేసి ఉన్న ఐదిళ్లలో దొంగలు పడ్డారు. కిషోర్ ఇంట్లో 60వేల రూపాయల నగదు, మూడు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. మరో మూడు రోజుల్లో గల్ఫ్‌కు వెళ్లనున్న కిషోర్ ఇంట్లో దొంగలు పడటంతో ఆయన కుటుంబసభ్యులు దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు. రాంరెడ్డి, గోపి, తదితరుల ఇళ్లలో దొంగలు పడ్డారు. గోపి ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న బైక్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు వచ్చి దొంగల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications