సోనియా వర్సస్ అమిత్ షా, ఒకే టైంలో - హైదరాబాద్ లో తేల్చేస్తారా..!!

కాంగ్రెస్ వర్సెస్ బిజెపి. పోటాపోటీ రాజకీయానికి హైదరాబాద్ వేదిక మారుతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఆ వెంటనే హైదరాబాద్ వేదిక ఒకే సమయంలో జరిగే బహిరంగ సభల్లో సోనియా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశముంది. ఇద్దరు అగ్ర నేతల సభలు ఇప్పుడు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

హైదరాబాద్ వేదికగా : కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు ఇప్పుడు తెలంగాణ పైన దృష్టి కేంద్రీకరించాయి. కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణ పైన కాంగ్రెస్ నాయకత్వం ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలు అమలు చేస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్ వేదిక నిర్వహిస్తుంది.

Hyderabads political spotlight :Sonia Gandhi vs Amit Shah showdown on September 17th

సెప్టెంబర్ 17 పైన చాలాకాలంగా వివాదం ఉంది. విమోచన, విలీనం అంటూ రాజకీయంగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సరిగ్గా అదే రోజున కాంగ్రెస్ బిజెపి అగ్ర నాయకత్వం హైదరాబాదులో మోహరిస్తుంది. రెండు పార్టీలు హోరాహోరీగా తమ బలం చాటుకునేలా భారీ బహిరంగ సభలకు సిద్ధమవుతున్నాయి.

కాంగ్రెస్ వర్సస్ బీజేపీ : కాంగ్రెస్ పార్టీ 17వ తేదీన తుక్కుగూడలో 10 లక్షల మందితో సభకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అదే రోజున విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలుస్తుంది. గత ఏడాది జరిగిన విమోచన వేడుకల్లోనూ అమిత్ షా పాల్గొన్నారు. అయితే 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కారణటంతో అమిత్ షా హాజరపైన పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

అమిత్ షా రాణి పక్షంలో మరో ముఖ్య నేత హాజరవుతారని బిజెపి నేతలు చెబుతున్నారు అటు కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ బహిరంగ సభకు హాజరు కానుండటంతో తెలంగాణ నుంచి ఎటువంటి సందేశం ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారుతుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేసే గ్యారెంటీ స్కీములను సోనియా హైదరాబాద్ వేదికగా ప్రకటించనున్నారు.

Hyderabads political spotlight :Sonia Gandhi vs Amit Shah showdown on September 17th

బల ప్రదర్శన - ఉత్కంఠ :కాంగ్రెస్ తుక్కుగూడలో సభను నిర్వహించాలని నిర్ణయిస్తే, పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలకు బిజెపి సిద్దమవుతుంది. సాధ్యమైనంత మేర జన సమీకరణ చేయాలని భావిస్తుంది. ఈ రెండు పార్టీల ఓరాహోరీ కార్యక్రమాలు,సభల వేళ బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తుందని ఆసక్తికరంగా మారుతుంది.

రెండు పార్టీలకు బీఆర్ఎస్ టార్గెట్ గా మారే ఛాన్స్ కనిపిస్తుంది. ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, అటు కేంద్రంలో వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో రెండు ప్రధాన జాతీయ పార్టీల అగ్ర నేతలు హైదరాబాదులో ఒకే సమయంలో పాల్గొనే బహిరంగ సభల పైన జాతీయస్థాయిలోనూ ఆసక్తి కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+