హైదరాబాద్ TO అరకు టూర్.. తక్కువ ధరకే సూపర్ ప్యాకేజీ..

హైదరాబాద్ వాసులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. బిజీ లైఫ్ లో కాస్త విశ్రాంతి తీసుకునేందుకు అనువుగా సూపర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేసే విధంగా ఈ టూర్ ఉంటుంది. వేసవిలో బెస్ట్ టూర్ అని చెప్పొచ్చు. ఈ టూర్ లో భాగంగా ఆంధ్రాలోని వైజాగ్, అరకు అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. క్కువ ధరలోనే ఒక వైపు దర్శనీయ ప్రదేశాలు, మరో వైపు బీచ్​ అందాలు, ప్రకృతి సోయగాలను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఈ ప్రత్యేక టూర్ ను హైదరాబాద్- వైజాగ్- అరకు పేరుతో తెలంగాణ టూరిజం శాఖ నడుపుతోంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ అరకు టూర్ సాగుతుంది. ఈ టూర్ లో భాగంగా మొదటిరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఐఆర్ ఓ పర్యాటక్ భవన్ నుంచి బస్సు స్టార్ట్ అవుతుంది. రాత్రి మొత్తం బస్సు ప్రయాణిస్తుంది. అలా మరుసటి రోజు ఉదయానికి వైజాగ్ చేరుకుంటారు. అక్కడే ఓ ప్రైవేట్ హోటల్ లో ఫ్రెష్ అవుతారు.

అక్కడే సైట్ విజిటింగ్ కు బయల్దేరుతారు. కైలాసగిరి, సింహాచలం దేవాలయాలను సందర్శిస్తారు. అక్కడినుంచి రుషికొండ, సబ్ మెరైన్ మ్యూజియం చూస్తారు. సాయంత్రం వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తారు. రాత్రి భోజనం, హోటల్ లో స్టే ఉంటుంది. ఇక మూడోరోజు అరకు టూర్ ప్రారంభం అవుతుంది. అక్కడ ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, బొర్రా గుహలను సందర్శిస్తారు. రాత్రి థింసా డ్యాన్స్ వీక్షించి అరకులోనే బస చేస్తారు.

ఇక నాలుగోరోజు అరకు నుంచి జర్నీ అన్నవరం దేవాలయానికి సాగుతుంది. ఇక అక్కడినుంచి హైదరాబాద్ కు రిటర్న్ జర్నీ ఉంటుంది. అలా రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది. ఐదో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు. దాంతో అరకు టూర్ ముగుస్తుంది. ఇక టికెట్ వివరాలు చూస్తే పెద్దలకు రూ. 7,500 గా ఉంది. అలాగే పిల్లలకు రూ. 600 గా ఉంది.

hyderabadvizag Araku Tour less price best tour Telangana Tourism Super Package at Lowest Price

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మార్చి 5న అందుబాటులో ఉంది. అది మిస్​ అయితే మార్చి​ 12, 19, 26, ఏప్రిల్ 2 తేదీల్లోనూ అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం అధికారిక తెలంగాణ టూరిజం సైట్ ను సంప్రదించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+