• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాద్ లో అనధికార లౌక్ డౌన్ - బోసిపోయింది : ట్రాఫిక్ నుంచి విద్యుత్ దాకా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

విశ్వనగరంగా ఎదుకుగుతున్న హైదరాబాద్ ఒక్క సారిగా బోసి పోయింది. ట్రాఫిక్ తో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లు - చౌరస్తాలు నిర్మానుష్యంగా మారాయి. వాహనాల మోతతో దద్దరిల్లే రోడ్ల పైన సౌండ్ లేదు. లాక్ డౌన్ అమలు చేస్తున్నారా అనే విధంగా రోడ్లు మారిపోయాయి. సంక్రాంతి ఎఫెక్ట్ కారణంగా నగర వాసులు సొంతూళ్ల బాట పట్టారు. రెండేళ్లుగా కరోనా కారణంగా సంక్రాంతికి దూరంగా ఉన్న లక్షలాది మంది.. ఈ సారి మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. నగర రోడ్ల పైన సాధారణంగా నిత్యం 50 లక్షల వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అయితే సంక్రాంతి పండుగ ముందు రోజుకే అది సగానికి తగ్గిపోయింది.

నిర్మానుష్యంగా ప్రధాన రోడ్లు

నిర్మానుష్యంగా ప్రధాన రోడ్లు

ఇక, ఈ రోజు నుంచి పండుగ సెలవులు కావటంతో మరింతగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ లో వారాంతంలో సహజంగా కొంత మేర రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడు మాత్రం నగరం దాదాపుగా బోసి పోయిన వాతావరణం కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్ తో కుస్తీ పడే నగరవాసులు..ఇప్పుడు హై వే మీద తరహాలో నగరంలోని రోడ్ల పైన ప్రయాణం చేస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విద్యుత్‌ వినియోగమూ తగ్గింది. సాధారణ రోజుల్లో నిత్యం 55 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వాడకం ఉంటుంది. నాలుగైదు రోజులుగా విద్యుత్‌ వినియోగం 47 మిలియన్‌ యూనిట్లలోపే ఉంటోందని అధికారులు చెబుతున్నారు. ఇక.. మెట్రో రైళ్లలోనూ ప్రయాణికుల రద్దీ రెండు రోజులుగా భారీగా తగ్గింది.

మెట్రోలు - విద్యుత్ పైనా ప్రభావం

మెట్రోలు - విద్యుత్ పైనా ప్రభావం

నగర పరిధిలోని నాగోలు-రాయదుర్గం, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌, ఎల్‌బీ నగర్‌-మియాపూర్‌ మార్గాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 11.15 వరకు 66 స్టేషన్ల నుంచి రోజుకు 820 ట్రిప్పులను నడిపిస్తున్నారు. ఈ మూడు కారిడార్ల పరిధిలో రోజుకు సగటున 2.50 నుంచి 2.70 లక్షల మంది ప్రయాణిస్తారు. బుధ, గురువారాల్లో ఆ సంఖ్య 1.5 లక్షలకు తగ్గిపోయింది.

అయితే.. పండుగకు ఊరెళ్లే వాహనాలన్నీ సాఫీ ప్రయాణం కోసం ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఎంచుకుంటుండడంతో గత నాలుగైదు రోజులుగా ఓఆర్‌ఆర్‌పై మాత్రం వాహనాల సంఖ్య బాగా పెరిగింది. ఐదు రోజుల్లో పది లక్షల వాహనాలు ఔటర్‌పై అదనంగా ప్రయాణం చేసినట్టు సమాచారం. సాధారణ రోజుల్లో రోజుకు 1.2 లక్షల వాహనాలు ప్రయాణిస్తాయి.

నాలుగు రోజులు నగరానికి విశ్రాంతి

నాలుగు రోజులు నగరానికి విశ్రాంతి

కానీ, రెండు, మూడు రోజులుగా.. 2లక్షల నుంచి 3లక్షల మేర వాహనాలు అదనంగా వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. నగరంలోని బస్టాండ్లు.. రైల్వే స్టేషన్ల నుంచి లక్షలాది మంది ప్రయాణాలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి 3.30 లక్షల మంది తరలివెళ్లినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. ఆర్టీసీ బస్సుల ద్వారా 1.80 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు చెప్పారు.

అటు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైనా రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌గేటు వద్ద విపరీతమైన వాహనాల రద్దీ నెలకొంది. గురువారం ఒక్క రోజే 50వేలకు పైగా వాహనాలు వెళ్లాయని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక, ఈ రద్దీని ప్రైవేటు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు.

బోసిపోయిన భాగ్యనగరం..తగ్గిన వ్యాపారం

బోసిపోయిన భాగ్యనగరం..తగ్గిన వ్యాపారం


అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. తమ రూటే సపరేటు అనే విధంగా వసూళ్లు కొనసాగిస్తున్నారు. ఈ మూడు రోజులు నగరం ఇలా బోసి పోయి కనిపించనుంది. తిరిగి సోమవారం నుంచి ఒక్క సారిగా మరలా హైదరాబాద్ సాధారణ రీతిలో జన సందోహం.. వాహనాల రద్దీతో తిరిగి కళకళ లాడటం మొదలు కానుంది. గతంలో ప్రతీ ఏటా సంక్రాంతికి ఇదే పరిస్థితి కనిపించేంది. కరోనా వచ్చిన తరువాత లాక్ డౌన్ సమయం లో ఇలాంటి పరిస్థితి చూడగా.. తిరిగి సంక్రాంతి వేళ..ఇప్పుడు మరోసారి హైదరాబాద్ బోసిపోయి కనిపిస్తోంది.

English summary
Hyderabad citry bored , roads seem to be empty with pongal effect . Lakhs of people went for own village for festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X