నాగార్జునకు సర్కార్ షాక్ - ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..!!
ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌కన్వెన్షన్ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం పత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైనా ఫిర్యాుదుల వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో, ఈ నిర్మాణం కు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది.
హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఫోకస్ చేసింది. నగరంలో ఆక్రమణల తొలిగింపు పైన దూకుడుగా వ్యవమరిస్తోంది. కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు.ఇదే సమయంలో హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన ఫిర్యాదులు ఉన్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రా గుర్తించింది.

గతంలోనే ఈ రకమైన ఫిర్యాదులు ఉన్నా..అప్పట్లోనే కూల్చివేస్తారనే ప్రచారం జరిగినా..చివరి నిమిషంలో కూల్చివేతలు ఆగిపోయాయి. మాదాపూర్ పరిధిలో తమ్మిడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును ఆక్రమించి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. అయితే, నాగార్జునకు చెందిన నిర్మాణం కావటంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవ్వరినీ వదిలిపెట్టేది హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications