ఆ ఇళ్ల జోలికి వెళ్లం.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా కమిషనర్
HYDRA (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. గతేడాది జులై 19న హైడ్రా ఏర్పడిందని.. అంతకుముందు ఉన్న ఇళ్లతోపాటు.. అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న భవనాల జోళికి వెళ్లమని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత అక్రమ కట్టడాలు నిర్మిస్తే వాటిని తొలగిస్తామని తెలిపారు.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) అంటే కూల్చివేతలు.. ధ్వంసం కాదని పర్యావరణ హితమైన నగరాభివృద్ధికి దోహదం చేసే సంస్థగా అందరూ గుర్తిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. గతేడాది జులై 19న హైడ్రా ఏర్పడిందని.. అంతకుముందు ఉన్న ఇళ్లతోపాటు.. అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న భవనాల జోళికి వెళ్లమని క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుందని.. ఈ కలను సాకారం చేయడంలో బ్యాంకర్ల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ఇల్లు కొనేందుకు రుణాలిచ్చే ముందు అన్ని విధాలా సరి చూసుకోవాలని ఈ మేరకు బ్యాంకర్లకు HYDRA కమిషనర్ రంగనాథ్ సూచించారు.
తాజాగా ఇనిస్టిట్యూషన్ ఆఫ్ వాల్యూయర్స్ రిజిస్టర్డ్ వాల్యూయర్స్ ఫౌండేషన్, IOV హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మేటివ్ ఎరాలో వాల్యుయేషన్ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా లక్ష్యాలు, దాని విధివిధానాలను వివరించారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెరిగిపోయిందని అన్నారు. స్థిరాస్తుల విలువ నిర్ధారించడంలో AI ఎంత ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిశీలన కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. టెక్నాలజీ మానవ పరిశీలనకు ప్రత్యామ్నాయం కాదని రంగనాథ్ తెలిపారు. ఏఐ అనేది ఒక సాధనం మాత్రమేనని, తుది నిర్ణయం తీసుకునే అధికారం మనిషికే ఉంటుందన్నారు.

హైదరాబాద్ మహా నగరానికి వరద ముప్పు రాకుండా తీర్చిదిద్దాలనేది హైడ్రా కీలక లక్ష్యం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి.. వాటిని పూర్తిస్థాయిలో పరిరక్షించేందుకు హైడ్రా ప్రయత్నిస్తోందన్నారు. చెరువులు, నాలాలు, పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను నిర్మూలించేందుకు హైడ్రా ప్రాధాన్యతనిస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications