పటాన్ చెరు, అమీన్‌పూర్‌లో రంగనాథ్ పర్యటన: జగన్‌కు నోటీసులపై ఏమన్నారంటే?
హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా విరుచుకుపడుతోంది. చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను రోజుల వ్యవధిలోనే నేలమట్టం చేస్తోంది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిశీలిస్తున్నారు. తాజాగా, శనివారం పటాన్‌చెరు, అమీన్‌పూర్ ప్రాంతాల్లో పర్యటించారు.
పటాన్‌చెరులోని సాకి చెరువును రంగనాథ్ పరిశీలించారు. ఇక్కడ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి. అధికారులతో సమీక్షించారు. చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. చెరువు వద్ద తూములు బంద్ చేసి ఇన్‌కోర్ సంస్థ అపార్ట్‌మెంట్ కట్టినట్లు ఆరోపణలు రావడంతో రంగనాథ్ వాటిని పరిశీలించారు.

మరోవైపు, అమీన్‌పూర్‌లోనూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. శంభుని కుంట, శంభికుంట బంధం కొమ్ము, చక్రవర్తి కాలనీ, అమీన్ పూర్ పెద్ద చెరువులును ఆయన పరిశీలించారు. చెరువుల కబ్జాలపై అడ్వకేట్ రవికృష్ణ హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఇక్కడి చెరువుల తూములను కబ్జా చేసి, కాలువలను మూసేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
జగన్‌కు నోటీసులపై రంగనాథ్ ఏమన్నారంటే?
ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. శంభునికుంట, సాకి చెరువు, అమీన్‌పూర్ పెద్ద చెరువు, బంధం కొమ్ము చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసుల ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని జగన్ లోటస్‌పాండ్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని.. త్వరలోనే హైడ్రా దాన్ని కూల్చేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన రంగనాథ్.. జగన్‌కు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. అంతేగాక, హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వదని.. ఆక్రమణ అని నిర్ధారించుకుంే నేరుగా వెళ్లి కూల్చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications