అయ్యప్ప సొసైటీపై హైడ్రా కమిషనర్ సంచలన ప్రకటన

హైదరాబాద్ నగరంలోని అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ విడుదల చేసిన ప్రకటనలో సంచలన విషయాలు వెల్లడించారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించిందని కమిషనర్ తెలిపారు. గతంలో స్లాబ్ పై కొన్ని రంధాలు చేశామని, బిల్డర్ ఆ రంధ్రాలను మూసివేసి 7 అంతస్తుల అక్రమ నిర్మాణానికి ముందుకొచ్చాడని సీరియస్ అయ్యారు.

హైకోర్టులో ధిక్కార పిటిషన్ కూడా దాఖలైందని, విచారణలో ఉందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్ని నిర్మాణాలు చట్టవిరుద్ధమని, ప్రస్తుతం కూల్చివేసిన భవనాన్ని అక్రమంగా నిర్మించేందుకు అనుమతించినందుకు బాధ్యులైన అధికారులపై నివేదిక ఇస్తామన్నారు. చర్యల కోసం ప్రభుత్వానికి కూడా పంపుతామని, ఈ అక్రమ భవనాల్లో అనేక హాస్టళ్లు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Hydra Commissioner s sensational comments on Ayyappa Society in Hyderabad

అగ్నిమాపక భద్రత, భవన నిర్మాణ అనుమతి లేకుండానే నిర్మించిన ఈ భవనాల్లో వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉంటున్నారని చెప్పారు. తాను శనివారం అయ్యప్ప సొసైటీ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు.. పలు చోట్ల డ్రైనేజీ రోడ్డుపై ప్రవహించడం గమనించినట్లు చెప్పారు. ఈ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ తో సమీక్షించి, అయ్యప్ప సొసైటీలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలను పరిష్కరించడానికి ఆయనతో కలిసి సమన్వయంతో పనిచేస్తామని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

ఇది ఇలా ఉండగా, ఇక నుంచి ప్రతి సోమవారం హైదరాబాద్ నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయింయించిన విషయం తెలిసిందే. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

అయితే, ఫిర్యాదు చేసే ముందు పూర్తి ఆధారాలు, వివరాలతో రావాలని కమిషనర్ రంగాథ్ సూచించారు. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే 040-295657558, 040-29560596 నెంబర్లను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రంగనాథ్ తెలిపారు.

మరోవైపు, మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఓ అక్రమ నిర్మాణంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డును ఆనుకుని ఐదు అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ హైడ్రాకు స్థానికులు తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ అక్కడికి వెళ్లి పరిశీలింంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+