విల్లాలపై విరుచుకుపడిన హైడ్రా బుల్డోజర్లు

హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలపై మరోసారి హైడ్రా విరుచుకుపడింది. తాజాగా మణికొండ నెక్నాంపూర్‌లో పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమంగా 13 విల్లాల నిర్మాణం జరిగిందని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రంగంలోకి దిగిన హైడ్రా బుల్డోజర్లు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నాయి.

ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు 4 విల్లాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. నెక్నాంపూర్​ చెరువును స్థానికులు కబ్జా చేసిన విషయం హైడ్రా దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్​ రంగనాథ్ ఆదేశాలతో సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. కూల్చివేతల సందర్బంగా పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Hydra demolishes 4 illegally constructed villas in Manikonda Hyderabad

కాగా, గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. Ftl పరిధిలో వున్నాయని గతంలో కొన్నిటిని కూల్చినట్లు ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు వివరించారు. మున్సిపాలిటీ, ఇరిగేషన్ నోటీసులు పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగడంపై కూల్చివేతలకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

శుక్రవారం ఉదయం కూల్చివేతలు ప్రారంభించారు హైడ్రా అధికారులు.
రెండు విల్లాలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు వుండడంతో.. కోర్టుకు సమాచారం యిచ్చి కూల్చివేతకు హైడ్రా చర్యలు తీసుకుంది. మొత్తం 13 విల్లాలు కాగా.. ఒక్కొక్కటి 400 గల విస్తీర్ణంలో ఒన్ ప్లస్ టూగా నిర్మాణంలో ఉన్నాయి.

కాగా, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పడిన హైడ్రా ఇప్పటికే హైదరాబాద్ నగర పరిధిలోని పలుచోట్ల అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది తెలిసిందే. ఇటీవలే మాదాపూర్‌​లో అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది. హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతోంది.

ప్రభుత్వ ఆస్తులు, చెరువులను ఆక్రమించి అక్రమార్కులపై చర్యలు కూడా తీసుకుంటోంది. మరోవైపు, ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో స్వయంగా హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ పరిశీలనకు వెళ్లి పరిశీలిస్తున్నారు. అక్రమ నిర్మాణాలని తేలితే కూల్చివేతలకు ఆదేశాలిస్తున్నారు.

మరోవైపు, అక్రమ నిర్మాణాలపై ప్రతి సోమవారం నగర వాసుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు. వారి ఫిర్యాదులపై స్వల్ప వ్యవధిలోనే స్పందిస్తామని పేర్కొన్నారు. ఇక, హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో, నాలాలు, చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+