అయ్యప్ప సొసైటీలో హైడ్రా తాజా కూల్చివేతలు

HYDRAA: హైడ్రా.. తాజా కూల్చివేతలను చేపట్టింది. శేరిలింగంపల్లి పరిధిలోని ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మాణంలో ఉన్న భారీ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేస్తోంది. కొద్దిసేపటి కిందటే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారక్కడ.

ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో 684 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్‌మెంట్ నిర్మితమైంది. ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది. దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ అపార్ట్‌మెంట్ అక్రమ నిర్మాణమంటూ స్థానికుల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. హైకోర్టు, జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయంటూ స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు.

HYDRAA demolish an illegally constructed building at Ayyappa Society in Khanamet Hyderabad

వీటిని దృష్టిలో ఉంచుకుని శనివారమే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు అయ్యప్ప సొసైటీని సందర్శించారు. 100 ఫీట్ రోడ్ పక్కనే నిర్మాణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ అక్రమ నిర్మాణమని నిర్ధారించారు. హైకోర్టు ఆదేశాలు, ఆ తరువాత జీహెచ్‌ఎంసీ ఇచ్చిన కూల్చివేత నోటీసులను కూడా బిల్డర్‌ బేఖాతర్ చేశాడని తేలింది.

సెల్లార్, జీ ప్లస్ 5 అంతస్తులు కలిగి ఉన్న ఈ భవనం అక్రమ నిర్మాణమంటూ 2024 ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ అయ్యాయి. హైకోర్టు కూడా దీన్ని అక్రమ నిర్మాణంగా నిర్ధారించింది. దానిపై చర్య తీసుకోవాలని ఆదేశించింది. గత ఏడాది జూన్‌లో జీహెచ్ఎంసీ మరోసారి నోటీసులు ఇచ్చినప్పటికీ బిల్డర్ స్పందించలేదు. దీనితో ఈ భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు.

అయినప్పటికీ- నిర్మాణం మాత్రం నిరాటంకంగా కొనసాగింది. దీనితో హైడ్రా రంగ ప్రవేశం చేసింది. స్వయంగా కమిషనర్ రంగనాథ్ దీన్ని పరిశీలించారు. డాక్యుమెంట్లు, గతంలో జీహెచ్ఎంసీ, హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిశీలించారు. అక్రమ నిర్మాణమంటూ నిర్ధారించారు. దీనితో ఈ ఉదయం కూల్చివేత పనులు మొదలయ్యాయి.

HYDRAA demolish an illegally constructed building at Ayyappa Society in Khanamet Hyderabad

హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.

ఇప్పటివరకు ఆక్రమణలకు గురైన మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా, మాదాపూర్‌ తమ్మిడికుంట వంటి ఎనిమిది చెరువులు, 12 పార్కుల భూములను కాపాడింది హైడ్రా. ఆయా చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్‌లల్లో నిర్మితమైన కట్టడాలను కూల్చివేసింది. ఆ స్థలాలకు విముక్తి కల్పించింది.

ఈ క్రమంలో తాజాగా రాయదుర్గం పరిధిలోని ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన ఇళ్లు, దుకాణాలను తొలగించింది హైడ్రా. ఈ ఉదయం నుంచే అక్కడ తొలగింపు పనులు మొదలయ్యాయి. బఫర్‌ జోన్ ప్రాంతంలో వేసిన ఫెన్సింగ్‌ను అధికారులు తొలగించారు. అక్కడ అక్రమంగా వెలిసిన 20 దుకాణాలను జేసీబీలతో కూల్చివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+