Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైడ్రా కూల్చివేతల్లో బిగ్ టర్న్: కన్నీరు మున్నీరు..!!

HYDRAA: హైదరాబాద్‌లో చెరువులు, కుంటల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్.. హైడ్రా పొలిటికల్ టర్న్ తీసుకుంది. హైడ్రా కూల్చివేతల నుంచి తమను ఆదుకోవాలంటూ మూసీ నిర్వాసితులు భారత్ రాష్ట్ర సమితి నాయకులను ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా, తుమ్మిడికుంట వంటి చెరువులు, వాటి ఎఫ్‌టీఎల్ పరిధి, బఫర్ జోన్ అధిగమించి నిర్మించిన పలు భవనాలు, అపార్ట్‌మెంట్లను ఇప్పటికే కూల్చివేశారు హైడ్రా అధికారులు.

Hydraa Residents from the Musi River area met BRS leaders Harish Rao and Sabita Indra Reddy

ఈ కూల్చివేతల వ్యవహారంలో దిగువ మధ్య తరగతి కుటుంబీకులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. సొంతిల్లు అనేది- జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశంగా భావిస్తారు మధ్యతరగతి కుటుంబీకులు. లక్షల రూపాయలు పెట్టి కొన్న ఇంటికి ఈఎంఐలు కట్టడానికే సగం జీవితం అయిపోతుందనే భావన సహజంగానే వారిలో ఉంటుంది. ఇల్లు, ఫ్లాట్ కొనాలనే కోరిక, చేతిలో చాలినంత డబ్బులు ఉన్నా కూడా ఇప్పుడు ముందుకు రావట్లేదు.

ఇప్పుడు కొత్తగా మూసీ నది పరీవాహక ప్రాంతంలో కూడా కూల్చివేతలను చేపట్టడం కలకలం రేపుతోంది. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించడానికి ఇదివరకే రెవెన్యూ అధికారులు ఇళ్లకు మార్కింగ్ సైతం పూర్తి చేశారు. కూల్చివేతలకు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో- ఇప్పటికే మూసీ నిర్వాసితులు లంగర్ హౌస్ వద్ద భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టిన విషయం తెలిసిందే.

Hydraa Residents from the Musi River area met BRS leaders Harish Rao and Sabita Indra Reddy

తాజాగా వారందరూ కూడా బీఆర్ఎస్‌ను ఆశ్రయించారు. తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డితో భేటీ అయ్యారు. కన్నీటితో తమ ఆవేదను వారికి వివరించారు. వారిలో మహిళలే పెద్ద సంఖ్యలో కనిపించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లకు మార్కింగ్ చేశారని, తమలాంటి పేదలు, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చడమే అభివృద్ధి సాధించినట్లా? అంటూ వాపోయారు.

Hydraa Residents from the Musi River area met BRS leaders Harish Rao and Sabita Indra Reddy

ఈ సందర్భంగా నిర్వాసితులతో హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి మాట్లాడారు. వారికి భరోసా ఇచ్చారు. మూసీలో గోదావరి నీళ్ల పారిస్తానంటోన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దీనికి బదులుగా పేదలు, మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందంటూ ధ్వజమెత్తారు. బుడ్జోజర్ రాజ్‌ను ఆపాలంటూ డిమాండ్ చేశారు.

మూసీ నిర్వాసితుల కోసం బీఆర్ఎస్ న్యాయవాదులు 24 గంటల పాటు 24 గంటలు తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉంటారని అన్నారు. తామందరం కూడా మూసీ నిర్వాసితులకు రక్షణ కవచంగా నిలబడతాంటూ హామీ ఇచ్చారు. ఒక్క ఫోన్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు వారి రక్షణగా ఉంటారని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+