వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు మనిషినే, 60సార్లు వెళ్లా: మంత్రి నాయిని

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను కూడా జైలు జీవితం గడిపానని, జైలు మనిషినే అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. చంచల్‌గూడ జైలును సోమవారం మంత్రి నాయిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీల సమస్యలు తనకు కూడా తెలుసన్నారు. ఎమర్జెన్సీ కాలంలో 18 నెలలు చంచల్‌గూడ జైలులో జైలు జీవితం గడిపానని గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా జైలుకు వెళ్లానని తెలిపారు. ముషీరాబాద్ జైలుకు సుమారు 50 నుంచి 60 సార్లు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు. ఖైదీల్లో ప్రవర్తన మారే విధంగా జైళ్లు ఉండాలన్నారు. జైళ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ జైళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.

I am also prisoner says Naini

ఖైదీల్లో పరివర్తన తెచ్చేలా జైళ్లు ఉండాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. జైళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జీవితంలో తొందరపడి తప్పు చేసి జైలుకు వచ్చిన వారిలో మార్పు తీసుకురావాలన్నారు.

జైళ్లలో ఖైదీలకు వృత్తి నైపుణ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జైళ్లకు ప్రత్యేక బడ్జెట్ ఇప్పిస్తానని హామీనిచ్చారు. దేశంలో కన్నా దక్షిణాదిన తమ రాష్ట్రం ముందుండేలా పని చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లను అవినీతిరహితంగా మార్చామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. దేశానికే తెలంగాణ జైళ్లు ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.

English summary
Telangana Home Minister Naini Narsimha Reddy on Monday said that he is also prisoner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X