వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌తో నేను మాట్లాడలేదు: రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న గద్దర్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో ఇంతవరకూ తాను రాజకీయాల గురించి మాట్లాడలేదని ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో పవన్‌తో కలిసి ముందుకు వెళతారా? అని ఒక న్యూస్ ఛానెల్‌లో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో ఇంతవరకూ తాను రాజకీయాల గురించి మాట్లాడలేదని ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో పవన్‌తో కలిసి ముందుకు వెళతారా? అని ఒక న్యూస్ ఛానెల్‌లో అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు.

ప్లాన్: తెలంగాణలో పవన్ కల్యాణ్ పార్టీ నేత గద్దర్?ప్లాన్: తెలంగాణలో పవన్ కల్యాణ్ పార్టీ నేత గద్దర్?

పార్టీ పెట్టడం కంటే..

పార్టీ పెట్టడం కంటే..

‘2019లో నేను ఎన్నికల్లో పోటీ చేస్తానా? లేదా? అనేది వేరే విషయం. ఉన్నపళంగా పార్టీ పెట్టడం కన్నా, భావ సారూప్యత ఉన్నవాళ్లందరినీ ఏకం చేస్తా' అంటూ గద్దర్ చెప్పుకొచ్చారు.

గద్దర్‌తో ముందుకు

గద్దర్‌తో ముందుకు

కాగా, 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని పవన్ కళ్యాణ్ నడిపేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో కూడా తన పార్టీని విస్తరించేందుకు వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు.

తెలంగాణలో గద్దర కీలకమే..

తెలంగాణలో గద్దర కీలకమే..

ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రజాగాయకుడిగా పేరొందిన గద్దర్‌ను పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున రంగంలోకి దింపుతారనే ప్రచారం విస్తృతంగా సాగింది. గద్దర్ అంటే తెలంగాణలో తెలియని వారుండరంటే అతియోశక్తి కాదు.

గద్దర్ సిద్ధమవుతారా?

గద్దర్ సిద్ధమవుతారా?

ప్రజా ఉద్యమాలతో ప్రజల్లో ఉంటున్న గద్దర్‌ను తెలంగాణలో జనసేన పార్టీ ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించాలని పవన్ చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గద్దర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, గద్దర్.. జనసేన పార్టీ తరపున తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారా? అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Gaddar on Wednesday said that he is not speak on politics with Janasena Party president Pawan Kalyan till now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X