'ఎమ్మెల్యేగా ఓటమికి ఎవ్వరినీ నిందించను'
హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమిపై ఎవ్వరినీ నిందించదలచుకోలేదని, ఫలితాలు వచ్చిన 24 గంటల్లో నియోజకవర్గ ప్రజలే పశ్చాతాపడ్డారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అన్నారు.
తన కార్యాలయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బుధవారం ఆయన తొలిసారి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటైన అభినందన సభలో ఆయన మాట్లాడారు.

సీమాంద్ర నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నతెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలు సైతం ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ అభినందన సభలో పాల్గొన్న భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తాను ఒక్క పరిశ్రమల శాఖకు మాత్రమే మంత్రినని, నిరంజన్‌రెడ్డి అన్ని శాఖలకు మంత్రి అని అన్నారు.












Click it and Unblock the Notifications