కవిత నన్ను అడగాల్సింది, ఆజాద్‌ను కలవలేదు, కేసీఆర్ ఇష్టం: డీఎస్ ట్విస్ట్
Recommended Video

హైదరాబాద్: తనపై చర్యలు తీసుకోవాలని లేఖ రాసిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలపై టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత డీ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసేందుకు డీఎస్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లుగా వార్తలు రావడం, జిల్లాకు చెందిన నేతలు ఫిర్యాదు చేయడం దురదృష్టకర పరిణామం అన్నారు. క్రమశిక్షణ గురించి నాకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ పార్టీలో ఉన్నా పద్ధతి ప్రకారం ఉంటానని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు సరికావని ఆవేదన వ్యక్తం చేశారు.

కవిత నాతో మాట్లాడితే సరిపోయేది
కవిత, నిజామాబాద్ ఎంపీలు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం సరికాదని, వారు అలా చేయకుండా తనతో మాట్లాడి స్పష్టత తీసుకుంటే సరిపోయేదని డీ శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రికి లేఖ రాసినందు వల్ల ఇప్పుడు ఆయన చేతుల్లో ఉందని, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే నిర్ణయం ఆయన చేతుల్లో ఉందన్నారు.

మా అబ్బాయి ఇండిపెండెంట్, ఆయన నిర్ణయం ఆయనది
తన అబ్బాయి అరవింద్ బీజేపీలో చేరిన అంశంతో తనకు సంబంధం లేదని డీఎస్ అభిప్రాయపడ్డారు. తమ అబ్బాయి ఇండిపెండెంట్ అని, ఆయన సొంత నిర్ణయాలు ఆయనకు ఉంటాయని తేల్చి చెప్పారు. అలాగే, తాను ఢిల్లీకి వెళ్లి రెండు రోజులు ఉండటంపై కవిత, తెరాస ఎంపీలు చేసిన విమర్శలపై కూడా ఆయన స్పందించారు.

అందుకే ఢిల్లీకి వెళ్లా, ఆజాద్‌ను కలవలేదు
తాను వ్యక్తిగత పనుల మీదనే ఢిల్లీకి వెళ్లానని డీఎస్ స్పష్టం చేశారు. తన క్వార్టర్ రిపేర్ పనులు చూసుకొని వచ్చానని చెప్పారు. ఢిల్లీ వెళ్లినప్పుడు తాను కాంగ్రెస్ పార్టీ నేతలను కలిశానని ఆరోపించడం సరికాదన్నారు. అయినా ఢిల్లీకి వెళ్తే కాంగ్రెస్ నేతలు కనిపించకపోతే ఇంకెవరు కనిపిస్తారని ప్రశ్నించారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆజాద్‌ను కలిశానని చెప్పడం పచ్చి అబద్దమని ఆయన మండిపడ్డారు. తాను తెరాసలో చేరిన తర్వాత రాజకీయ నేతలను కలవడమే మానేశానని స్పష్టం చేశారు.

కొత్త ట్విస్ట్ ఇచ్చిన డీఎస్
తనపై వారు చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం సరికాదని డీఎస్ అన్నారు. ముఖ్యమంత్రికి కవిత, నిజామాబాద్ ఎమ్మెల్యేలు ఎందుకు లేఖ రాయవలసి వచ్చిందో వారినే అడిగి తెలుసుకోవాలన్నారు. ఆరు గంటలకు కేసీఆర్‌తో భేటీపై తనకు సమాచారం లేదన్నారు. అపాయింటుమెంట్ ఖరారు కాలేదన్నారు. తొలుత కేసీఆర్‌తో భేటీకి ఆయనకు అపాయింటుమెంట్ దొరికినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ డీఎస్ తనకు సమాచారం లేదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. కాగా, డీఎస్ గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications