హైద్రాబాద్ బిర్యానీ తినకుండా వెళ్లను, ఫలక్‌నుమా అద్భుతం: సచిన్
హైదరాబాద్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మంగళవారం నాడు హైదరాబాదులో అభిమానులను అలరించారు. ఆయన భాగ్యనగరంలో స్మాష్ గేమింగ్ జోన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. తాను ఎప్పుడు నగరానికి వచ్చినా హైదరాబాద్ బిర్యాని తినకుండా వెళ్లనని చెప్పారు. ఫలక్ నుమా ప్యాలెస్ అద్భుతమైన కట్టడం అని కితాబిచ్చారు. సచిన్ గచ్చిబౌలి ఇనార్బిట్ మాల్‌లో నెలకొల్పిన స్పోర్ట్స్ పార్క్‌ను ప్రారంభించారు.

సచిన్‌ను చూసేందుకు అభిమానులు, నగరవాసులు ఎగబడ్డారు. ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్న సచిన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం కిటకిటలాడింది.
ప్రో కబడ్డీ 2015 పోటీలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం నాడు రాత్రి తెలుగు టైటాన్స్ - జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను సచిన్ టెండుల్కర్ వీక్షించనున్నారు.












Click it and Unblock the Notifications